A salute to the saviour Sonu Sood : స్పైస్ జెట్ పై సోను ఫోటోతో అరుదైన గౌరవం

A salute to saviour Sonu Sood SpiceJet  : సేవకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ నటుడు  సోనూసూద్ అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోనుకు అత్యంత అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు. దానికి ‘‘ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్’’ అనే క్యాప్షన్ రాశారు. తెల్లటి విమానంమీద సోనుసూద్ చిత్రం..దానికి ఎర్రని అక్షరాలతో ‘‘ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్’’ అని క్యాప్షన్ పెట్టటం నిజంగా హ్యాట్సాఫ్ టూ సోనూ కదూ..

కరోనా సమయంలో సేవకు మారుపేరుగా నిలిచిన సోనూ చేసిన వలస కార్మికులకు చేసిన సేవలు అద్వితీయమైనవి. పొట్ట చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వచ్చిన వలస కార్మికులకు లాక్ డౌన్ తో పనులు కోల్పోయి తినటానికి తిండి కూడా లేక..సొంత ఊర్లకు వెళ్లటానికి చేతిలో చిల్లిగవ్వలేక పడరాని పాట్లు పడి..కష్టాలను ఎదురీదిన వలస కార్మికులను వారి వారి సొంత ఊర్లకు చేర్చారు సోనూసూద్.

కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాననే భరోసానిస్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించటం..చదువులు చెప్పించటం..కష్టంలో ఉన్నవారికి కాదనకుండా..లేదనకుండా..చేయలేననే మాట రాకుండా ఎన్నో..ఎన్నెన్నో సేవలు చేశారు సోనూసూద్. ప్రభుత్వాలు కూడా చేయలేనని పనులు చేశారు. ఆయన చేసిన సేవలకు విదేశీయాన విమాన సంస్థ స్పేస్ జెట్ అరుదైన గౌరవాన్నిస్తూ.. ‘‘ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్’’ అనే క్యాప్షన్ రాసింది.

సోనూసూద్ చేసిన సేవల్ని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తమవంతు సహాయాన్ని అందించారు. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు. లాక్ డౌన్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూసూద్ సాయంతో ఊరట పొందారు. సోనూ సేవలకు దేశం మొత్తం కొనియాడింది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు.

సోనూసూద్‌ చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేసి..ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అనే క్యాప్షన్ వేసింది. ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం. నిస్వార్థమైన సోనూ సేవలకు స్పేస్ జెట్ ఇచ్చిన అరుదైన గౌరవం నిజంగా గర్వించాల్సిన విషయం.

లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు. స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషంగా ఉన్నారు. తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సూనూ సూద్ ఇక మీదట కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

సినీ నటుడు నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు. ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే మొదటి సారి.

లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న కార్మికులను, విద్యార్థులను తన వంతు సాయం అందించారు. సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.

స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషంగా ఉన్నారు. తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసిన సోనూ సూద్… ఇకపై కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Remember coming from Moga to Mumbai on an unreserved ticket.
Thank you everyone for all the love. Miss my parents more. @flyspicejet pic.twitter.com/MYipwwYReG
— sonu sood (@SonuSood) March 20, 2021

ట్రెండింగ్ వార్తలు