నేనున్నా..అంటూ కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటున్న సోనూ సూద్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సోనూ..ఇచ్చిన సమాధానం అందర్నీ ఆకర్షిస్తోంది. అసలు ఆ నెటిజన్ ఏమి అడిగాడు ? సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడు ?
కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న వారికి నేనున్నా..అంటూ సహాయం చేస్తున్న..సోనూకు సోషల్ మీడియా..ద్వారా చిత్ర, విచిత్ర అభ్యర్థనలు ఎదురవుతున్నాయి. అంతే సరదాగా సోనూ తీసుకుంటూ..రెస్పాండ్ అవుతున్నారు.
నీలేశ్ నింబోరే అనే నెటిజన్ విచిత్ర సహాయం కోరాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా..ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుతుంటే..తాను చూస్తూ ఉండిపోతున్నానని, వీడియో గేమ్ లు ఆడుకొనేందుకు వీలుగా..ప్లే స్టేషన్ -4 గేమింగ్ కన్సోల్ కొనివ్వాలని కోరాడు.
ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీనికి సోనూ స్పందించారు. నీ దగ్గర ప్లే స్టేషన్ లేకపోతే..నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. కొన్ని పుస్తకాలు తెచ్చుకో..చదువుకో..పుస్తకాల కోసం సాయం చేయమంటే..తప్పకుండ చేస్తా..అంటూ చెప్పారు.
If you don’t have a PS4 then you are blessed. Get some books and read. I can do that for you ? https://t.co/K5Z43M6k1Y
— sonu sood (@SonuSood) August 6, 2020