ఎలానో తెలుసుకోండి : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ

  • Publish Date - March 2, 2019 / 04:59 AM IST

డ్రైవింగ్‌ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలంటే పనులన్నీ వదిలిపెట్టి RTO ఆఫీసలు చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారా? డ్రైవింగ్ లైసెన్స్ లు రెన్యువల్ కు రూల్స్ ఏంటి? ఇలా ఉన్నాయని విసుగు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులు తగ్గనున్నాయి. అవును నిజమే. దేశవ్యాప్తంగా డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్‌ ఇకపై సింపుల్ గా చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా లైసెన్స్ ట్రాన్స్ ఫర్, రెన్యువల్‌ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) అడగవద్దంటూ అన్నీ రాష్ట్రాల రవాణాశాఖలను కేంద్రం ఆదేశించనుంది. 
Read Also : జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి

డ్రైవర్ల వివరాలను ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచి ఉన్నందున NOCని నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ‘సారథి’ అనే డేటాబేస్ లో  వివరాలు పొందుపరచే ఉన్నాయని అంటున్నారు. వెయ్యికి పైగా ఆర్టీవోలు ‘సారథి’  డేటాబేస్ కి అనుసంధానమై ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

– ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ ను ట్రాన్ స్ఫర్ కానీ రెన్యువల్ కానీ చేసుకునేందుకు అభ్యర్ధులు అప్లై చేసినపుడు RTO అధికారులను రెండు మార్గాలను సూచించేవారు. 
– ఫిజికల్ NOC తేవడం కానీ, సంబంధిత అధికారి డీఎల్ కు NOC ఇవ్వమంటూ రిక్వెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. 
– కొత్తగా వస్తున్న నిబంధనల ప్రకారం డేటా ఆన్ లైన్ లో కనిపిస్తుంది కాబట్టి డీఎల్ వెంటనే NOCతో పని లేకుండా రెన్యువల్‌ చేయవచ్చు.

– అంతే కాకుండా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వాహనాలను మార్చుకునేందుకు కూడా ప్రాసెస్ ను ఈజీ చేసేందుకు కేంద్రం ప్రణాళికలు వేస్తుంది. 
ఇందుకోసం అధికారులు పని చేస్తున్నారని, త్వరలో ఈ సమస్యకు కూడా పరిష్కారం కనుక్కుంటామని అధికారులు చెబుతున్నారు. 
Read Also : టీడీపీలో టిక్కెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా!