Ayodhya Ram Mandir Inauguration : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిద్యాలతో ధ్వనులు.. ఏపీ నుంచి ఘటం

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు.

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిధ్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు తెలిపింది. మొత్తం 2గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం ఉంటుంది.

Also Read : Ayodha Ram Mandir photos : అయోధ్య రామమందిరం ఫొటోలు.. ప్రారంభోత్సవానికి ముందు ముస్తాబైన ఆలయం.. ఎంత అందంగా ఉందో..

  • ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం
  • ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ పఖావాజ్, ఫ్లూట్ , ధోలక్
  • కర్ణాటక నుంచి వీణ
  • పంజాబ్ నుంచి అల్గోజా
  • మహారాష్ట్ర నుంచి సుందరి
  • ఒరిస్సా నుంచి మర్దల్
  • మధ్యప్రదేశ్ నుంచి సంతూర్
  • మణిపూర్ నుంచి పంగ్
  • అస్సాం నుంచి నగారా, కలి
  • ఛత్తీస్‌గఢ్ నుంచి తంబురా
  • ఢిల్లీ నుంచి షెహనాయ్
  • రాజస్థాన్ నుంచి రావణహత
  • పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీఖోల్, సరోద్
  • తమిళనాడు నాగస్వరం, తవిల్ మరియు మృదంగం
  • జార్ఖండ్ నుంచి సితార్
  • గుజరాత్ నుంచి నారింజ
  • బీహార్ నుంచి పఖావాజ్
  • ఉత్తరాఖండ్ నుంచి హుడ్కా