Delhi Elections : ఢిల్లీ నీదా? నాదా? హస్తినలో ఆప్, బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం..

ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మ్యానిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి.

Delhi Elections : అది ఢిల్లీ పీఠం. ఆధిపత్యం కోసం ఒక పార్టీ పోరాటం. జెండా పాతాలని మరో పార్టీ ఆరాటం. ఉనికి చాటుకోవాలని ఇంకో పార్టీ వ్యూహం. మొత్తానికి హస్తినలో రాజకీయం వింటర్ లోనూ వేడి పుట్టిస్తోంది. నిజానికి వచ్చే ఏడాది ఆరంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు. కానీ, హస్తినని హస్తగతం చేసుకోవాలని ఇప్పటి నుంచే కొదమ సింహాల్లా తలపడుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని ఎన్డీయే.

ఢిల్లీ నీదా నాదా? సత్తా చాటేదెవరో తేల్చుకుందాం రా.. సై అంటే సై..తగ్గేదేలే.. ఇలా సాగుతోంది హస్తినలో ఆప్, బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం. ఒకరిపై ఒకరి విమర్శలు తీవ్రమయ్యాయి. ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మ్యానిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి. అదే సమయంలో అవినీతి, అక్రమాలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేజ్రీవాల్ మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగి బీజేపీతో తాడోపేడో తేల్చేసుకుంటానంటున్నాడు.

అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు.. ఢిల్లీ ఒక్కటే ఒక ఎత్తు. ఆరు నూరైనా ఏది ఏమైనా ఆ ఒక్కటి కొడితే చాలు.. హస్తిన దక్కితే దేశంలో కమలానికి తిరుగుండదు. ఇది బీజేపీ ఆలోచిస్తున్న తీరు. ఎలాగైనా హస్తిన చేజారకూడదు. ఎత్తులకు పైఎత్తులు వేసైనా సరే క్లీన్ స్వీప్ చేయాలి. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిందే. అదీ ఒంటరిగానే.

పూర్తి వివరాలు..