Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ల అమలుకు బ్రేక్.. వీగిపోయిన బిల్లు

Womens Reservation Bill : ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించలేదు

Special Parliament Session Women Reservation Delimitation Bill not passed in Lok Sabha

Womens Reservation Bill : డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తొలుత లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. అయితే ఈ బిల్లు పాస్ కాలేదు. వీగిపోయింది.

ఓటింగ్ సమయంలో ఈ ఈ బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి.మొత్తం ఓటింగ్ లో పాల్గొన్న వారి సంఖ్య 489గా నమోదయ్యింది.

కానీ ఓటింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల కొందరి ఓట్లు నమోదు కాలేదు.

వారికి పేపర్ మీద ఎస్ ఆర్ నో రాసి ఇచ్చేందుకు అవకాశం కల్పించారు.

దీంతో చివరకు ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తం ఓటింగ్ లో పాల్గొన్న వారి సంఖ్య 528 మందిగా తేలింది.

బిల్లు ఆమోదం పొందాలంటే వాస్తవానికి కావాల్సిన ఓట్లు (528లో 2/3) 352. కానీ అనుకూలంగా వచ్చింది మాత్రం 298. మరో 54 ఓట్ల దూరంలో బిల్లు ఆగిపోయింది. దీంతో బిల్లు వీగిపోయింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు అంటే డీలిమిటేషన్‌ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026లను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. శనివారానికి సభను వాయిదా వేశారు.

వాస్తవానికి లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540. ఏ బిల్లు అయినా ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది మద్దతు కావాలి. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. కానీ నేడు ఎన్డీఏకు మద్దతుగా 298 ఓట్లు వచ్చాయి. 6గురు పెరిగారు.