SpiceJet తో Sonu Sood, 1500 మంది భారత విద్యార్థుల తరలింపుకు సన్నాహాలు

  • Publish Date - July 24, 2020 / 06:48 AM IST

ప్రముఖ బాలీవుడ్ విలన్ సోనూ సూద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని స్వస్థలాలకు చేర్చడం..వారిని ఆదుకోవడంతో రియల్ హీరో అయిపోయారు. మానవత్వమే ప్రధానమంటున్న ఇతను..తాజాగా..విదేశాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను తరలించేందుకు రెడీ అయ్యాడు.

ఒకరు..కాదు ఇద్దరు కాదు..ఏకంగా 1500 మంది విద్యార్థులు చిక్కుకపోయారు. కిర్గిజ్ స్థాన్ లో 1500 మంది భారత విద్యార్థులు చిక్కుకపోయారని నటుడు సోనూ సూద్ కు తెలిసింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. అంతమంది విద్యార్థులను తరలించడం తన ఒక్కడి వల్ల కాదని..తెలుసుకుని ప్రముఖ విమానయాన సంస్థ SpiceJet తో చర్చలు జరిపారు.

వారితో చేతులు కలిపారు. ఈ విషయాన్ని స్వయంగా SpiceJet తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఓ భారీ తరలింపుకు శ్రీకారం చుడుతున్నామని, 1500 మంది భారతీయ విద్యార్థులను వారి కుటుంబాల వద్దకు చేర్చే అతి పెద్ద కార్యక్రమమని వెల్లడించింది.

ఈ తరలింపులో భాగంగా ఇప్పటికే 9 విమానాలు ఢిల్లీ నుంచి బయలుదేరాయని తెలిపింది. సో..మొత్తానికి అందరి హృదయాల్లో సోనూ సూద్ స్థానం సంపాదించుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు