Sputnik V
Sputnik V దేశంలో రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్ వి” వియోగానికి భారత్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. విషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత ఇండియాలో అనుమతి పొందిన మూడో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. కరోనా మహమ్మారి రెండో వేవ్ విరుచుకుపడటం..అనేక రాష్ట్రాలు టీకా కొరతపై ఆందోళన వ్యక్తం చేయడంతో స్పుత్నిక్ వి కి అనుమతి మంజూరు చేసింది కేంద్రం. గత వారం భారత డ్రగ్స్ రెగ్యులేటర్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) రష్యన్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది.
మే నెల మొదటి వారం నుంచి స్పుత్నిక్ V మన దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అయితే స్పుత్నిక్ V వ్యాక్సిన్ ధర విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. అంతర్జాతీయంగా ఈ వ్యాక్సిన్ ను 10 డాలర్లకు విక్రయిస్తున్నారు. ఇండియాలో కూడా అదే ధరకు అంటే రూ.750కి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఒక్కో డోసును విక్రయించంచే అవకాశముందని భారత్ లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించినప్పటికీ..దిగుమతి చేసుకునే డోసుల ధరపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని..ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని గురువారం ఓ ప్రకటనలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది.
అయితే మే-జాన్ నాటికి కొన్ని వందల వేల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. మొదట్లో స్పుత్నిక్ వి దిగుమతుల తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వాటిని ఇక్కడే పూర్తి స్థాయిలో తయారు చేయనుంది. ఇండియాలో జూన్ నుంచి స్పుత్నిక్ వీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో వాటి తయారీ ప్రారంభమైన తర్వాత ధర తగ్గే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు.