×
Ad

Squirrel Bird Picnic : ఉడుత, పిచ్చుక చిట్‌చాట్..! సో క్యూట్..!!

ఎప్పుడూ ఎవరిబిజీలో వారు ఉంటూ క్షణం కూడా తీరికలేదాయో పాపం.. కలుసుకోవడానికి.. అందుకే కాబోలు అన్ని పనులకు కాస్తా విరామమిచ్చాయి. సరదాగా గడపాలనుకున్నాయి. ఉడుత.. పిచ్చుక ఊసులాడుకున్నాయి..

Squirrel Enjoys Picnic With Bird In Viral Pic. So Cute, Says Internet

Squirrel enjoys picnic with bird : ఎప్పుడూ ఎవరిబిజీలో వారు ఉంటూ క్షణం కూడా తీరికలేదాయో పాపం.. కలుసుకోవడానికి.. అందుకే కాబోలు అన్ని పనులకు కాస్తా విరామమిచ్చాయి. సరదాగా గడపాలనుకున్నాయి. ఉడుత.. పిచ్చుక ఊసులాడుకున్నాయి.. రెండు కలిసి చెట్టాపట్టాలేసుకుని పిక్ నిక్ వెళ్లాయి. సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి.


ఇష్టమైన ఆహారాన్ని ముందు పెట్టుకుని తింటూ సరదాగా పిక్ నిక్ ఎంజాయ్ చేశాయి. టేబుల్ పై సిద్ధంగా ఉన్న నట్స్ తింటూ కష్టసుఖాలను పాలుపంచుకున్నాయి. ఉడుత, పిచ్చుకల చిట్ చాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట చిట్ చాట్ ఫొటోలను చూసి నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. సరదాగా స్నేహితుడు పిచ్చుకతో కలిసి పిక్ నిక్ వచ్చిన ఉడుత.. మీల్ ట్రీట్ ఎంజాయ్ చేసిందంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.


నెటిజన్లు తమకు తోచినట్టుగా సరదా ట్వీట్లతో కామెంట్లు పెడుతున్నారు. వాట్ ఏ లవలీ ఫొటో అని ఒక నెటిజన్ అంటే.. మరో యూజర్ సో క్యూట్ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఉడుతా.. ఉడుతా.. ఊచ్.. ఎక్కడికెళ్లావ్ ఊచ్.. పిక్ నెక్ వెళ్లావా ఊచ్.. పిచ్చుకతో వెళ్లావా ఊచ్ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.