శ్రీలంకలోని ఇండియన్స్ : హెల్ప్‌లైన్ నెంబర్స్

  • Publish Date - April 21, 2019 / 09:31 AM IST

శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..తమ వారు ఎలా ఉన్నారోనని ఆయా దేశాల్లో ఉన్న వారు తెగ ఆరాట పడుతున్నారు. తమ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో లంకలో ఉన్న ఇండియన్స్ కోసం హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఫోన్లు చేసి తగిన సహాయ, సహకారాలు కోరవచ్చన్నారు. ఫోన్ నెంబర్లు +9477 7903 082, +9411 2422 788, +9411 2422 789 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సుష్మా స్వరాజ్. 

కొలంబోలో రక్తం మోడింది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో ఎంతో మంది ప్రార్థనలు చేసుకోవడానికి ఆయా చర్చీలకు వెళ్లారు. కొలంబోలోని 5 చర్చీలు, 2 ఫైవ్ స్టార్ హోటల్స్‌లో పేలుళ్లు సంభవించాయి. మొత్తం 185 మంది మృ‌త్యువాత పడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. ఉగ్రవాద దాడులను భారతదేశంతో పాటు ఇతర దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఘటపై ప్రధాని మోడీ, విదేశాంగ కార్యదర్శి సుష్మా స్వరాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వెల్లడించారు. భారతీయుల పరిస్థితులపై ఆరా తీస్తున్నామని, దీనికోసం నిరంతరాయంగా కొలంబోలోని భారత రాయబార కార్యలాయాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు.