Ayodhya Sri Ram Mandir : 2024 జనవరి 1న భక్తులకు దర్శనమివ్వనున్న్ అయోధ్య రామయ్య..8.5 అడుగుల ఎత్తులో శ్రీరాముడు విగ్రహం

అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2024 జనవరి నాటికి అయోధ్య శ్రీరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహానికి సంబంధించిన డిజైన్‌పై రామమందిర ట్రస్ట్‌ కసరత్తు చేస్తోంది. 8.5 అడుగుల ఎత్తులో రాముడి విగ్రహం రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

Ayodhya Sri Ram Mandir : అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2024 జనవరి నాటికి అయోధ్య శ్రీరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహానికి సంబంధించిన డిజైన్‌పై రామమందిర ట్రస్ట్‌ కసరత్తు చేస్తోంది. 8.5 అడుగుల ఎత్తులో రాముడి విగ్రహం రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలావరకు రామాలయం పనులు పూర్తయ్యాయి. 2024 జనవరి 1వ తేదీన రామమందిరాన్ని భక్తుల కోసం ఓపెన్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు.

ఆలయంలో భగవాన్‌ రామ్‌లలా శాశ్వత విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు మేధోమధనం మొదలైంది. రామ్‌లాలా విగ్రహం కోసం తమ తమ నమూనాలను పంపాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశంలోని ప్రముఖ శిల్పులను కోరింది. ఒడిశాకు చెందిన ప్రముఖ శిల్పులు సుదర్శన్ సాహు, వాసుదేవ్ కామత్, కె.వి., కర్నాటకకు చెందిన మానియా, పూణెకు చెందిన శాస్త్రజ్య దేవుల్కర్… 9 నుంచి 12 అంగుళాల విగ్రహం నమూనాలను పంపనున్నారు. వీరు పంపినవాటిలో ఏదైన ఒక నమూనాను ట్రస్ట్‌ ఎంపిక చేయనుంది. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన శిలతో రామ్‌లలా విగ్రహాన్ని రూపొందించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. రాముడి విగ్రహం మోడల్‌ ఎంపిక చేసిన తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన రాయికి అనుమతి ఇవ్వాలన్నది నిర్ణయించనున్నారు. శ్రీరాముడి విగ్రహం 8.5 అడుగుల నుంచి 9 అడుగుల వరకు ఉండనుంది. సూర్యుడి కిరణాలు రాముడి విగ్రహంపై పడేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

రామాలయ నిర్మాణాన్ని శరవేగంగా చేస్తున్నప్పటికీ నాణ్యత, వాస్తు విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదంటోంది రామజన్మభూమి ట్రస్ట్‌. దేశంలోని ప్రముఖ సంస్థానాలు, భవన డిజైన్‌ నిపుణులులో రామమందిరం గర్భలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. శ్రీరాముడు జన్మించిన నవమి రోజున 12 గంటలకు సూర్యుడి కిరణాలు రాంలలా నుదుటిపై ప్రకాశించే విధంగా డిజైన్‌ చేస్తున్నారు. బిల్డింగ్ డిజైన్‌ కోసం దేశంలోనే నైపుణ్యం కలిగిన అగ్రశ్రేణి సంస్థలను ట్రస్ట్ నియమించింది. CSIR-CBRI, రూర్కీ, ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే, ప్రఖ్యాత ఆలయ ఆర్కిటెక్ట్‌ల బృందం పర్యవేక్షణలో గర్భగుడి నిర్మాణం జరగనుంది. వాస్తు శాస్త్రంలోని ‘నీలాంబుజ్‌శ్యామలకోమలాయిగ్‌’ శ్లోకం ఆధారంగా రాముడి విగ్రహాన్ని రూపొందించనున్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 2021 జనవరిలో తవ్వకాలు మొదలుపెట్టి మార్చిలో పూర్తి చేశారు. 2022 జనవరిలో ఆలయ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టారు. మందిరం పైకప్పు, గోపురం పనులు 2023 ఆగస్టు నాటికి పూర్తవుతాయి. రామ మందిరం ఎత్తును 141 అడుగుల నుంచి 161 అడుగులకు పెంచినట్లు అర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా తెలిపారు. అదనంగా మరో మూడు గోపురాలను జోడించారు. అలాగే ఆయంలోని స్తంభాల సంఖ్యను 160 నుంచి 366కి పెంచారు. మందిర నిర్మాణంలో తెలంగాణ, కర్ణాటక గ్రానైట్‌ను వినియోగిస్తున్నారు. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లా నుంచి గులాబీ రాయిని, మక్రానా నుంచి తెలుపు మార్బుల్‌ని ఉపయోగిస్తున్నారు.రాముడి ఆలయ నిర్మాణంతో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. అయోధ్యకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రస్ట్‌ చర్యలు చేపడుతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు