Kambala Srinivas Gowda
Kambala racing Srinivas Gowda : భారత ఉసేన్ బోల్ట్‌గా పేరొందిన కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు సృష్టించాడు. గతేడాది కంబాళ పోటీల్లో దున్నలతో పాటు 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడు.. ఇప్పుడు జరిగిన పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశాడు.
గతేడాది జరిగిన పోటీల్లో ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) బ్రేక్ చేశాడు. కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో నిర్వహించిన 125 మీటర్ల పరుగు పోటీలో శ్రీనివాస గౌడ.. 11.21 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నాడు. లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధృవీకరించారు.