Srinivasa Kalyanam : ఈ నెల 16న బెంగళూరులో శ్రీవారి కళ్యాణం
బెంగళూరులో ఈ నెల 16వ తేదీన శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. డిసెంబర్ 16న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులలో కలిసి ఏర్పాట్లను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించి పలు సూచనలు చేశారు.
- bheemraj
- Published On : December 10, 2022 / 03:49 PM IST
Srinivasa Kalyanam
Srinivasa Kalyanam : బెంగళూరులో ఈ నెల 16వ తేదీన శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. డిసెంబర్ 16న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులలో కలిసి ఏర్పాట్లను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించి పలు సూచనలు చేశారు. బెంగళూరు రాంనగర్ స్టేడియంలో వేదిక నిర్మాణం, విద్యుత్ పుష్పాలంకరణలు, భద్రత ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు.
శ్రీవారి కళ్యాణం సందర్బంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన పనలు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
విజిలెన్స్ స్థానిక పోలీసు అధికారులతో చర్చించి అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బారికేడ్లు, వీఐపీల ప్రవేశ, నిష్ట్రమణ మార్గాలు, భక్తులు కూర్చునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. జేఈఓ సమక్షంలో ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, వీజీఓ మనోహర్, డీఈ రవి శంకర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, శ్రీనివాస కళ్యాణం దాత మాజీ సీఎం కుమార స్వామి ప్రతినిధి అశ్విన్, బెంగళూరు పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
