Stock Market
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ నష్టాలతో ముగిసింది. బుధవారం ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే కాసేపటికే డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి సాగింది. చివరికి నష్టాల్లో ముగిసింది. యూరప్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలే ఇందుకు కారణం.
South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్‌ల భర్తీ
అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశీయ సూచీల సెంటిమెంట్ దెబ్బతింది. చమురు ధరలు పెరుగుతుండడం యూరప్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. మరోవైపు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటివరకు అవలంభించిన సర్దుబాటు ధోరణికి ఆర్బీఐ స్వస్తి పలకనుందనే సంకేతాలు ఇన్వెస్టర్లను కలవపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమై రూ.75.02 దగ్గర ఆరు నెలల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది.
Tomato Cultivation : టమాటా సాగుతో భారీ లాభాలు…ఆరు నెలల్లో 30లక్షల ఆదాయం
ఉదయం సెన్సెక్స్ 59,942.00 పాయింట్ల దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,963.57 – 59,079.86 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 555.15 పాయింట్ల నష్టంతో 59,189.73 దగ్గర ముగిసింది. నిఫ్టీ 195.30 పాయింట్లు కోల్పోయి 17,627.00 దగ్గర స్థిరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు, బజాజ్ ఫినాన్స్ మాత్రమే లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, రిలయన్స్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, టైటన్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు అధిక నష్టాలు చూశాయి.