Stock Markets : ఆర్బీఐ నిర్ణయంతో భారీగా స్టాక్ మార్కెట్లు పతనం

రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. దీంతో సెన్సెక్స్ 1,307 పాయింట్లు తగ్గి 55,669 వద్ద ముగిసింది.

Stock Markets : ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. దీంతో సెన్సెక్స్ 1,307 పాయింట్లు తగ్గి 55,669 వద్ద ముగిసింది.

నిఫ్టీ 391 పాయింట్లు తగ్గి 16,677 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 899 పాయింట్లకు తగ్గింది. అత్యధికంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ షేర్లు 6.43 శాతం పతనం అయ్యాయి. అలాగే అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో కంపెనీలు నష్టపోయాయి.

RBI : ఆర్బీఐ సంచలన నిర్ణయం..భారీగా పెరుగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు

ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపోరేటు 4.40 శాతానికి చేరింది. బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు భారీగా పెరుగనున్నాయి. 2022 తర్వాత తొలిపారి రెపో రేటు పెరిగింది. ఫెడ్ నిర్ణయానికి ముందే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచింది.

ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగడంతో వడ్డీ పెంచక తప్పలేదని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు