Madhya Pradesh
Madhya Pradesh : మూడేళ్లుగా బకాయిపడిన ట్యూషన్ ఫీజు చెల్లించమని ఓ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు విద్యార్ధుల్ని కోరాడు. అంతే.. కంట్రీ-మేడ్ పిస్టల్‌తో ఆ ఉపాధ్యాయుడి మీద కాల్పులు జరిపారు ఆ స్టూడెంట్స్.. సంచలనం కలిగించిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
Kerala : ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి .. పాఠాలు చెప్పటానికి 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న టీచర్
చదువు చెప్పిన ఉపాధ్యాయుడి ప్రాణాలు తీయాలనుకున్నారు ఇద్దరు విద్యార్ధులు. బకాయిపడ్డ ట్యూషన్ ఫీజు అడిగినందుకు కంట్రీ-మేడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపారు. కలకలం రేపిన ఈ ఘటన భోపాల్ మోరేనా జిల్లా జౌరా రోడ్డులో జరిగింది. ఉపాధ్యాయుడు గిర్వార్ సింగ్ వద్ద ట్యూషన్ చెప్పించుకున్న ఇద్దరు స్టూడెంట్స్ అతనిని కోచింగ్ సెంటర్ బయటకు పిలిచారు. బైక్ మీద ఉన్న ఇద్దరు సింగ్‌ను మొదట బాగానే పలకరించారు. వీరిలో ఒకరు అకస్మాత్తుగా పిస్టల్ తీసి సింగ్ కడుపుపై కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచ బైక్‌పై పారిపోయారు. గాయపడిన సింగ్‌ను దారిన పోయేవారు ఆసుపత్రికి తరలించారు.
Assam : స్కూల్లో 30 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించిన టీచర్ ..
దాడి చేసిన ఇద్దరు స్టూడెంట్స్ మూడేళ్ల క్రితం 12 వ తరగతి పరీక్షలు రాసేవరకూ సింగ్ కోచించ్ సెంటర్‌లో చదువుకున్నారని తెలుస్తోంది. స్టూడెంట్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#Video| Students Talk Normally With Their Former Teacher, Then Fire At Him pic.twitter.com/3znpHTtXEO
— NDTV (@ndtv) June 23, 2023