Classroom
Viral video: క్లాస్ రూంలో.. ఒకే బోర్డుపై, ఒకేసారి రెండు సబ్జెక్టుల పాఠాలు ఇద్దరు ఉపాధ్యాయులు వేరువేరుగా బోధించడం మీరు ఎక్కడైనా చూశారా? ఒక సబ్జెక్ట్ బోధిస్తేనే పూర్తిగా అర్థంకాదు.. ఇక రెండు సబ్జెక్టులా.. అనుకుంటున్నారా.. బీహార్ రాష్ట్రం కతిహార్ లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో ఈ వింత రోజూ జరుగుతుంది. ఇద్దరు టీచర్లు ఒకే క్లాస్ రూంలో ఒకే బోర్డుపై ఎవరి పాఠం వాళ్లు చెబుతారు. విద్యార్థులు ఎవరు చెప్పేది వినాలో తెలియక వారిపనిలో వారు నిమగ్నమవుతుంటారు.
అయితే ఇక్కడ మరో వింత కూడా ఉంది.. ఉపాధ్యాయులు బ్లాక్ బోర్డుపై ఎవరి పాఠాలు వారు చెబుతుంటే విద్యార్థులను అల్లరి చేయకుండా చూసేందుకు ప్రిన్సిపల్ ఓ చైర్ వేసుకొని అక్కడే ఉంటారు. ఆ సమయంలో విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు స్కూల్ ప్రిన్సిపాల్ పడే కష్టాలు అన్నీఇన్నీకావు. ఒకే బోర్డుపై.. ఒకే సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు వేరువేరు సబ్జెక్టుల పాఠాలు బోధించడం వెనుక ఓ కారణం ఉంది. 2017లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను, అక్కడ ప్రభుత్వ స్కూల్లోకి షిప్ట్ చేశారు. అయితే ఆ పాఠశాలలో తగినన్ని తరగతి గదులు, బ్లాక్ బోర్డులు లేవు. అందుకే చేసేదేమీ లేక అలా చేయాల్సి వస్తుందని అక్కడి ఉపాధ్యాయులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1526148457144037376?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1526148457144037376%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Flatest-news%2Findia-news%2Fhindi-and-urdu-being-taught-on-same-blackboard-in-one-classroom-in-bihar%2Farticleshow%2F91600307.cms
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించారు. ఒకే తరగతి గదిలో ఒకే బ్లాక్ బోర్డుపై బోధించడం మంచిది కాదని, ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో విద్యార్థుల నమోదు ఆధారంగా ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు ఒక క్లాస్ రూమ్ కేటాయిస్తామని డీఈవో తెలిపారు.