Sudha Murthy Narayana Murthy Love story : ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సుధాల లవ్ స్టోరీ .. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పి సిగ్గుపడిన సుధామూర్తి

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.

Sudha Murthy Narayana Murthy Love story : ఎంతోమంది ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకుంటారు గానీ కొంతమంది మాత్రమే వివాహ బంధానికి మచ్చుతునకలుగా నిలుస్తారు. సమాజానికి మంచి సందేశాన్నిచ్చేలా వారి వివాహం బంధం స్పూర్తిగా నిలుపుకుంటారు. అటువంటి ఆదర్శ జంట ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి, సుధామూర్తిల జంట అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నారాయణమూర్తికి 76 సంవత్సాలు, సుధామూర్తికి 72 సంవత్సరాలు. ఈనాటికి వారి జంట స్పూర్తినిస్తోంది నేటి తరానికి. నారాయణమూర్తి, సుధలు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారనే విషయం మీకు తెలుసా? అప్పట్లోనే వారి వివాహం ఓ సంచలనం అనే చెప్పాలి. అందాల జాబిల్లిలాంటి సుధా అందానికి నారాయణమూర్తి ఓ ప్రేమపిపాసి అనే చెప్పాలి. వారి లవ్ స్టోరీ గురించి..వారిద్దరి తొలి పరిచయం గురించి సుధామూర్తి చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు వింటే వారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం..నమ్మకం..అనిర్వచనీయమైన ప్రేమ బంధం ఎంతగా పెనవేసుకుని ఉందో తెలుస్తుంది..తన భర్త నాయరణమూర్తితో తొలి పరిచయం గురించి చెప్పి ముసిముసిగా నవ్వేసారు సుధామూర్తి..మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేమంటే..

హీరోలా ఉంటాడనుకుంటే చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నారట సుధా తన నారాయణమూర్తిని చూసి..పెళ్లికి ముందు తన భర్త నారాయణమూర్తిని తొలిసారి చూసినప్పుడు ‘ఎవరీ చిన్నపిల్లాడు?’ అని అనుకున్నారట సుధా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధామూర్తి వారి ప్రేమకథ విషయాలను పంచుకున్నారు.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుకుంటు తెలిపారు. ఓ ఫ్రెండ్ ద్వారా తనకు నారాయణమూర్తి పరిచయం అయ్యారని తెలిపారు. మరి సుధా మాటల్లోనే ఆమె తొలిపరిచయం గురించి తెలుసుకుందాం..

‘‘నాకు ప్రసన్న అని ఓ స్నేహితురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు ఓ పుస్తకం తీసుకొచ్చేది. అందులో తొలిపేజీపై నారాయణమూర్తి పేరుండేది. ఆ పేజీలో నారాయణమూర్తి పేరుతో పాటు పలు దేశాల పేర్లు ఉండేవి. వాటిని చూసి నారాయణమూర్తి అంతర్జాతీయ బస్ కండక్టర్ ఏమో అనుకున్నా. ఓరోజు ఆయనను కలిసేందుకు వెళ్లా. చూడకముందు ఏదో ఊహించుకొన్నాను. హీరోలా ఉంటాడనుకున్నాను. తలుపు తెరవగానే.. ‘ఎవరీ పిల్లాడు?’ అనిపించింది’’ అంటూ సుధామూర్తి ద గ్రేట్ నాయారణమూర్తి గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. అలా చెబుతు నవ్వేశారామె.

సుధా నారాయణమూర్తి సతీమణిగానే గాక.. రచయిత్రి, విద్యావేత్త, వితరణశీలిగా మంచి పేరున్న మహిళ. మమ్మల్ని ఏమడిగినా ఇస్తాం గానీ పుస్తకాలు మాత్రం ఇవ్వం..పుస్తకం అనేది కొనుక్కుని చదువుకోవాలి..అలా చేస్తే ఆ పుస్తకం రాసిన రచయిత(త్రు)లను ప్రోత్సహించనట్లు అవుతుంది అని సుధామూర్తి గతంలో చాలాసార్లు చెప్పారు.

నారాయణమూర్తి సుధామూర్తిల దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు గ్రేట్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి, కుమార్డు రోహన్. సుధామూర్తి పెద్ద కుటుంబంలోంచి వచ్చినా ఈనాటికి సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు. చాలా సింపుల్ గా ఉంటారామె. దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తుంటారు. ఎంతోమందికి సహాయంగా నిలవటమే కాకుండా స్ఫూర్తిగా సుధామూర్తి నిలుస్తుంటారు. 44 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగినా ఈనాటికి చక్కటి అవగామనతో వివాహ బంధానికి ప్రతీకగా నేటి తరనికి స్ఫూర్తిగా నిలుస్తున్నారీ జంట, సుధామూర్తిని ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే.


										

ట్రెండింగ్ వార్తలు