Sultan Mahmud Begada Food
Sultan Mahmud Begada Food : బాల్యపు ఛాయలు వీడకుండానే సింహాసనాన్ని అధిష్టించి రాజు (సుల్తాన్) అయిన చరిత్ర ఆ చక్రవర్తిది. 13 ఏళ్లకే రాజుగా పట్టాభిషిక్తుడై 53 ఏళ్లపాటు రాజ్యాలను పాలించిన ఆ చక్రవర్తి విషాన్ని కూడా ఆహారంగా అవలీలగా తినేసేవాడు. ఈ సుల్తాన్ ను అపర బకాసురుడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అతను రోజుకు తినే ఆహారంతో ఓ ఫంక్షనే చేయొచ్చు. అంత తిన్నా ఆయన చక్కటి ఫిట్ నెస్ తో ఉండేవాడు. 150 అరటి పండ్లను కేవలం బ్రేక్ ఫాస్టుగా తినే ఆయనే గుజరాత్ చక్రవర్తి. ఆయనను మహమూద్ బెగాడ అంటారు. అసలు పేరు మహమూద్. ‘గిర్నార్’, జునాగఢ్,చంపానేర్ కోటలను జయించిన తర్వాత సుల్తాన్ మహమూద్ కు ‘బేగాడా అనే బిరుదు వచ్చింది. అప్పటినుంచి ఆయన్ని సుల్తాన్ మహమూబ్ బెగాడ అంటారు..!! బాగాడు ఒత్తైన మీసాలు..పొడవాటి గడ్డంతో గంభీరంగా కనిపించేవాడు. అంత తిండి తిన్నా చక్కటి ఫిట్ నెస్ తో ఉండటం బెగాడా ప్రత్యేకత..
35 కిలోల అన్నం.. 150 అరటి పండ్లు.. ఒక పెద్ద గిన్నెడు తేనే.. మరో గిన్నెడు వెన్న ఈజీగా లాగించేస్తాడు. కాసేపటికే ఆకలంటాడు. మరో నాలుగు ఐదు కిలోల పరమాన్నం మెక్కేస్తాడు. 100కి వండిన అన్నాన్ని అవలీలగా లాగించేస్తాడు బెగాడ. రోజుకు కిలోలకొద్దీ ఆహారం తినేసే రాజు బెగాడకు రాత్రి మెలకువ వస్తే మళ్లీ ఆకలేస్తుంది. అందుకే రాజుగారి గురించి తెలిసిన ఆయన సిబ్బంది ముందు జాగ్రత్తగా భారీగా ఆహారాన్ని ఆయన మంచం పక్కనే పెడతారు. తెల్లారి చూస్తే ఆ ఆహారం కనిపించదు. అంటే రాత్రి సమయంలో కూడా బెగాడ ఓ పట్టుపట్టేస్తారు. అదికూడా కేవలం కిలోల సమోసాలను.ఇలా రాజు బెగాడ తినే ఆహారం గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది.
15వ శతాబ్దంలో బెగాడ గుజరాత్‌ను పరిపాలించాడు మహమూద్ బెగాడ. ఆయన అసలు పేరు మహమూద్ షా. 13 ఏండ్లకే సింహాసనం అధిష్ఠించిన బెగాడ.. 53 ఏండ్ల పాటు చక్రవర్తిగా పాలించాడు. బెగాడ శారీరకంగా మాంచి ఫిట్‌గా ఉండేవాడు. ఈ బకాసుర రాజు బెగాడ ఉదయం లేచీ లేవగానే తిండి తింటూనే రోజును ప్రారంభిస్తాడు. తిండి తింటూనే రోజును ముగిస్తాడు. రాజుగారు ఏం పనిచేసినా పక్కన పెద్ద పెద్ద ప్లేట్లలో ఆహార పదార్ధాలు ఉండాల్సిందే. ఉదయం లేవగానే ఒక పెద్ద గిన్నె నిండా తేనె, మరో పెద్ద గిన్నె నిండా వెన్న తినేస్తాడు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్టుగా 100 నుంచి 150 వరకు అరటి పండ్లు లాగించేస్తాడు.
ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనాల గురించి చెప్పనే అక్కర్లేదు. ఓ ఫంక్షన్ కు వండినన్ని వంటకాలు ఒక్కడే లాగించేస్తాడు. రకరకాల కూరలు..పిండి వంటలతో కలిపి కిలోల కొద్ది తినేస్తాడు. ఆ తరువాత కాసేపటికే ఆకలి అంటాడు. దీంతో సిబ్బంది అప్పటికే నాలుగైదు కిలోల పరమాన్నం లేదా ఇతర స్వీట్స్ వండి బెగాడ రాజుగారికి వండి సిద్ధంగా ఉంచుతారు. వాటిని అవలీలగా లాగించేస్తాడు బెగాడ.
రాత్రి భోజనం కూడా భారీగానే తినేసి పడుకున్నాక కూడా మళ్లీ ఆకలేస్తుందంటాడు. ఇది బాగా అలవాటు అయిపోయిన సిబ్బంది రాత్రిళ్లు ఆయన మంచానికి అటు ఇటు మటన్ సమోసాలను సిబ్బంది ఉంచేవారట. పొద్దున సిబ్బంది వెళ్లి చూసేసరికి అవన్నీ ఖాళీ అయిపోయేవి. ఇంకేముంది రాజుగారి వాటిని కూడా ఖాళీ చేసేసాడని అనుకునేవారట సిబ్బంది. రాజు బెగాడ తిండి విషయాన్ని యూరోపియన్ చరిత్రకారులు కథకథలుగా చెబుతుంటారు.
గుజరాత్‌ను పాలిస్తున్న సమయంలో బెగాడపై శత్రువులు విషప్రయోగం చేశారు. కానీ అదృష్టవశాత్తూ ఆ విషపు కుట్ర నుంచి బెగాడ తప్పించుకున్నాడు. అదికూడా ఆయన తిండి మహత్యమనే అంటారు. తనపై శతృవులు ప్రయోగించిన విషాన్ని కూడా అమృతంగా మార్చేసుకుంది బెగాడ శరీరం. అలా అప్పట్నుంచి విషాన్ని కూడా తట్టుకునే శక్తి కోసం రోజూ కొంత విషాన్ని ఆహారంగా తీసుకునేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా రోజు విషాన్ని ఆహారంగా తీసుకోవడంతో ఆయన సిబ్బంది ఆయన దగ్గరకు వెళ్లటానికి భయపడేవారట. ఆఖరికి ఆయన విప్పేసిన బట్టలను ముట్టుకోవాలన్నా భయపడేవాళ్లట. బెగాడ వేసుకున్న బట్టలు విషపూరితమై ఉంటాయని..అందుకే ఆయన విడిచిన దుస్తులను దూరంగా తీసుకెళ్లి కాల్చేసేవారట…ఆ సెగ తగిలినా చనిపోతారనే భయంతో దూరంగా ఉండేవారట..అది ఈ బకాసుర రాజుగారి తిండి చరిత్ర..!