India పదాన్ని తొలగించి ‘Bharat’ మాత్రమే వాడాలని జూన్ 2న సుప్రీం కోర్టులో వాదనలు

  • Publish Date - May 29, 2020 / 11:16 AM IST

India పదాన్ని తొలగించి భారత్ లేదా హిందూస్థాన్ మాత్రమే వాడేలా చేయాలని జూన్ 2న సుప్రీం కోర్టులో వాదనలు వినిపించనున్నారు. మన జాతి గొప్పదనం తెలియాలంటే.. పేరు మార్చాల్సిందేననేది వాదన. రాజ్యంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రాంతాన్ని ప్రతిబింబించేలా భారత్/హిందూస్థాన్ అనే పేర్లు ఉంచాలని ఇండియాను తొలగించాలని అంటున్నారు. 

అపెక్స్ కోర్టు ముందు శుక్రవారం ఈ పిటిషన్ ను ప్రవేశపెట్టారు. కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) S A Bobde లిస్టు నుంచి దీనిని డిలీట్ చేసేశారు. టాప్ కోర్ట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన దానిని బట్టి జూన్ 2న వాదనలు వినిపించాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి.. ఈ అమెండ్‌మెంట్ దేశ పౌరుల్లో భావన మార్చుతుందని పేర్కొన్నాడు. 

‘ఇంగ్లీష్ పేరు తొలగిస్తే సింబాలిక్ గా మన దేశ గొప్పదనాన్ని జాతిని కాపాడుకున్న వాళ్లమవుతాం.. భవిష్యత్ తరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకా, ఇండియా అనే పేరుకు బదులు భారత్ అనే పదాన్ని వాడితే స్వాతంత్ర్యం కోసం మన పూర్వికులు చేసిన పోరాటానికి న్యాయం చేకూర్చిన వాళ్లం అవుతాం’ అని ఆయన పేర్కొన్నాడు. 

Read: Twitter సపోర్ట్: ఆ పదాన్ని తొలగించాలంటోన్న Anand Mahindra