Supreme Court : కరోనా మాత ఆలయం కూల్చివేతపై పిటిషన్ వేసిన వ్యక్తులకు రూ.5 వేలు జరిమానా

కరోనా మాత ఆలయం కూల్చివేతను సవాల్‌ చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులకు సుప్రీంకోర్టు రూ.5వేల జరిమానా విధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో లోకేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ ఆలయాన్ని నిర్మించారు.

Corona Mata temple : కరోనా మాత ఆలయం కూల్చివేతను సవాల్‌ చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులకు సుప్రీంకోర్టు రూ.5వేల జరిమానా విధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్‌ జిల్లా జుహి శుకుల్‌పుర్‌ గ్రామంలోని ఓ స్థలంలో లోకేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి జూన్‌7న కరోనా మాత ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

అయితే జూన్‌ 11న రాత్రి ఆ గుడి కూల్చివేశారు. దీంతో లోకేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, అతని భార్య దీపమాల శ్రీవాస్తవ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆలయం నిర్మించిన స్థలం వివాదంలో ఉందని, అది ముగ్గురికి చెందిన ఉమ్మడి ఆస్తి అని విచారణలో తేలింది. దీంతో జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ కూడిన ధర్మాసనం పిటిషన్ వేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Vista dome Coach: విశాఖ – అరకు టూరిజానికి మరో 4అద్దాల రైళ్లు రెడీ

వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించడమే కాకుండా, కోర్టు సమయాన్ని దుర్వినియోగపరిచినందుకుగానూ సదరు వ్యక్తులపై రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆ మొత్తాన్ని 4 వారాల్లోగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంక్షేమ సంఘం నిధికి జమచేయాలని ఆదేశించింది. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ట్రెండింగ్ వార్తలు