Supreme Court Notices : కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

Supreme Court notices to Center govt : కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు… ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అంతే కాకుండా… ఈ విచారణ సమయంలో సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

లాక్‌డౌన్ విధించే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది. కరోనా పరిస్థితులపై రేపు మరోసారి విచారించనుంది. కరోనాపై రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న కేసుల విచారణ కూడా సుప్రీంకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

కోవిడ్ కేసుల్లో సలహాదారుగా సీనియర్ న్యాయవాది హరశ్ సాల్వేను సుప్రీంకోర్టు నియమించింది. దేశంలో కరోనా పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని పేర్కొంది. ఆక్సిజన్ సప్లై, అత్యవసర మందులపై జాతీయ విధానం ఉందా అని ప్రశ్నించింది. నాలుగు అంశాలపై సుప్రిం కోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది.

 

ట్రెండింగ్ వార్తలు