Supreme Court: అయోధ్య కేసును రాజకీయం చేయొద్దు.. సుప్రీం కోర్ట్ సంచలన కామెంట్స్
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
- V Santhosh Kumar
- Published on- July 20, 2026 / 05:43 PM IST
Supreme Court made sensational comments, urging the Ayodhya case not be politicized
- ఈ కేసును రాజకీయం చేయొద్దు
- సిట్ విచారణలో కీలక అరెస్టులు
- చంపత్ రాయ్ రాజీనామా చేశారు
Supreme Court: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని పిటిషనర్లకు తెగేసి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం, కోర్టులు రాజకీయాలకు వేదికలు కాదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన అంశమని, సరైన విచారణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో ముందడుగు వేస్తూ, తదుపరి పురోగతిని పర్యవేక్షించేందుకు విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
Ktr: డెడ్ స్టోరేజ్‌లో నీళ్లు.. కోల్డ్ స్టోరేజ్‌లో ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్
మరోవైపు ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణలో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు లెక్కింపు సమయంలో పర్యవేక్షణ లోపించిందని గుర్తించిన అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరామ(Supreme Court) జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేయడం కలకలం రేపింది. ఈ దొంగతనం వ్యవహారంపై సీబీఐ, కాగ్‌లతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం యూపీ పోలీసులతో పాటు పర్యవేక్షణ బృందాలు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశాయి.
