మహా థ్రిల్లర్ : బలపరీక్షపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫడ్నవిస్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్

  • Publish Date - November 25, 2019 / 06:37 AM IST

మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫడ్నవిస్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్

మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్ 26,2019) ఉదయం 10.30గంటలకి తీర్పు ఇవ్వనుంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. మంగళవారం కోర్టు ఇచ్చే తుది తీర్పు ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. 

మహారాష్ట్ర పరిణామాలపై సోమవారం(నవంబర్ 25,2019) సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. గంట 20 నిమిషాల పాట ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. బీజేపీ తరఫున ముకుల్ రోహిత్గీ.. కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ తరఫున.. కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలను జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం వింది. కాగా తక్షణమే బలపరీక్ష జరపాలని ఎన్సీపీ లాయర్ సింఘ్వీ కోర్టుని కోరగా.. రెండు మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న ప్రతిపక్షాల వాదనలతో సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. గవర్నర్ నిర్ణయంలో ఎలాంటి తప్పిదం లేదన్నారు. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం కరెక్టే అని వాదనలు వినిపించారు.

బలపరీక్షపై విచారణ సందర్భంగా ఫడ్నవీస్ సర్కార్ కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల లేఖలు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖను కోర్టుకి సమర్పించారు సొలిసిటర్ జనరల్. మొత్తంగా మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఇక తీర్పు రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు