Supreme Court notice to Centre on plea seeking action against forced religious conversion
Supreme Court : బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం స్పందన ఏంటో తెలియజేయాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. శుక్రవారం (సెప్టెంబర్ 23,2022) కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, న్యాయశాఖలకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై నవంబరు 14లోగా సమాధానం తెలపాలని కోరింది.
బెదిరింపులకు పాల్పడుతుం బలవంతంగా మతమార్పిళ్లు చేయటం..బహుమతులు పంచిపెడుతూ, నగదు ప్రయోజనాలు ఆశ చూపిస్తూ జరుగుతున్న జరుగుతున్న మతమార్పిళ్లను అడ్డుకునేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్న ధర్మాసనం స్పందించింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.