Arvind Kejriwal : సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్ లిస్ట్ చేయడానికి కోర్టు రిజిస్ట్రీ నిరాకరణ

సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ ..

Arvind Kejriwal

Delhi Liquor Policy Scam : సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చినందున, ప్రస్తుత దరఖాస్తును కొనసాగించడం సాధ్యం కాదనే కారణంతో కేజ్రీవాల్ పిటిషన్ లిస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేయబడినందున, ప్రస్తుత మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగింపు దరఖాస్తుకు ప్రధాన పిటిషన్‌కు ఎటువంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది.

Also Read : నేను అప్పుడే చెప్పాను.. ఇప్పుడు నిజమైంది.. అందరినీ అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ కు సార్వత్రిక ఎన్నికలు, ప్రచారం నేపథ్యంలో మే 10 నుంచి జూన్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మరో వారంరోజులు పొడిగించాలని మే 27న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపును కేజ్రీవాల్ కోరారు. అయితే, కేజ్రీవాల్ పిటీషన్ ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. దీంతో జూన్ 2న కేజ్రీవాల్‌ తీహార్ జైలులో లొంగిపోయే అవకాశం ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు