Supreme Court : ప్రొఫెసర్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. మరోసారి విచారించాలని ఆదేశం

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈకేసును మరోసారి విచారించాలని ఆదేశించింది.

Supreme Court professor Saibaba

Supreme Court : ప్రొఫెసర్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటిస్తు బాంబే కోర్టు 2022 అక్టోబర్ 15 ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. ఈ కేసును మరోసారి విచారించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాయిబాబాను (మరో ఐదుగురిని కూడా) నిర్ధోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఐఏ (National Investigation Agency) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా కేసును మరోసారి విచారించాలని, విచారణ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని బాంబే హైకోర్టు ప్రధాని న్యాయమూర్తిని ఆదేశిస్తు న్యాయమూర్తులు MR షా, CT రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (ఏప్రిల్ 19,2023) కొట్టివేసింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూచనతో సాయిబాబాబు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో సాయిబాబా నిర్దోషి అనే విషయాన్ని మరోసారి విచారించాలని ఆదేశించింది. కాగా..మహారాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వకేట్ అభికల్ప్ ప్రతాప్ సింగ్ వాదించగా సాయిబాబా తరపున సీనియర్ న్యాయవాది అర్ బసంత్ వాదించారు.

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర పోలీసులు 2013లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2014 మే 9న సాయిబాబాను ఢిల్లీలో అరెస్టు చేశారు. కోర్టు సాయిబాబాను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. ఈ వ్యవహారంలో సాయిబాబాతో పాటు మహేశ్‌ టిర్కీ, హేమ్‌ కేశవదత్త మిశ్రా, ప్రశాంత్‌ రాహి, విజయ్‌ నాన్‌ టిర్కీ, పాండు పొరా నరోతే జైల్లో ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని వీరి ఆధ్వర్యంలో దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అత్యంత కఠిన చట్టం అయిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), భారత శిక్షాస్మృతి (IPC) కింద గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదుచేసింది.

దీనిపై విచారణ తరువాత 2017 మార్చిలో వారిని కోర్టు దోషులుగా ప్రకటిస్తూ..సాయిబాబా సహా ఐదుగురికి జీవిత ఖైదు, ఒకరికి 10ఏళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆరుగురూ 2017లోనే గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీరును ముంబై హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ ముందు సవాల్‌ చేశారు. దీంతో సాయిబాబాకు సెషన్స్‌ కోర్టు విధించిన జీవిత ఖైదు, జైలు శిక్షను హైకోర్టు కొట్టివేసింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా భావిస్తు బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అలా ఎనిమిదేళ్లుగా కొనసాగిన ఈ కేసుపై తీర్పులు సవాళ్లుగా జరిగి ఆఖరికి ఎట్టకేలకు ప్రొఫెసర్ సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈకేసును మరోసారి విచారించాలని సూచిస్తు ముంబై కోర్టుకు ఆదేశించింది.

కాగా సాయిబాబా నాగపూర్ జైలులో ఉన్న సమయంలోనే అతని తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చివరి దశలో ఉన్న తల్లిని ఒక్కసారైనా చూడటానికి అవకాశం కల్పించాలని నాగపూర్ హైకోర్టు బెంచ్ కు విన్నవించుకున్నారు. కానీ అతని అభ్యర్థనను తిరస్కరించింది. ఈక్రమంలో క్యాన్సర్ తో సాయిబాబా తల్లి కోకరకొండ సూర్యావతి 74 ఏళ్ల వయస్సులో ప్రాణాలు కోల్పోయారు. దీంతో తల్లి వీడియో కాల్ ద్వారా అయినా చూపించాలని సాయిబాబా కోరగా నాగపూర్ జైలు అధికార వర్గాలు నిరాకరించాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంత్యక్రియలు జరిగిపోయాయి. కొడుకును చూడాలన్న ఆమె చివరి కోరికను తీర్చలేకపోయానంటూ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు.

జైలులో ఉన్న సాయిబాబా అసలే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలోనే 2019లో కరోనా బారిన పడ్డారు. అంగ వైకల్యంతో పాటు కిడ్నీ, గుండె సంధిత వ్యాధులతో బాధపడుతున్న భర్త గురించి ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. 2017 మార్చి నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను మానవతా దృక్పథంతో అయినా విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.