Supreme Court: కుటుంబ గొడవల్లోకి న్యాయవాదులను లాగొద్దంటూ లలిత్ మోదీకి సుప్రీంకోర్టు చురక

లలిత్ మోదీకి ఆయన తల్లి బీనా మోదకి సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదా జరుగుతోంది. ఈ కేసులో బీనా మోదీ తరపున ముకుల్ రోహత్గీ న్యాయవాదిగా ఉన్నారు. దీంతో రోహత్గీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో లలిత్ మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని పోస్టులలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం మరో పోస్టులో క్షమాపణ చెప్పారు

Supreme Court warns lalit modi over personal clashes

Supreme Court: ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీకి సుప్రీంకోర్టు శుక్రవారం చురకలు అంటించింది. కుటుంబ తగాదాల్లోకి న్యాయవాదులను లాగొద్దని సూచించింది. సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీపై సోషల్ మీడియా వేదికగా లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘మీ న్యాయ పోరాటం వేరు. ఇందులోకి న్యాయవాదుల్ని తీసుకురాకండి’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.

Egypt Archeology Department : ఈజిప్ట్‌లో వెలుగులోకి 18వందల ఏళ్ల పురాతన నగరం.. వీడియో వైరల్

లలిత్ మోదీకి ఆయన తల్లి బీనా మోదకి సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదా జరుగుతోంది. ఈ కేసులో బీనా మోదీ తరపున ముకుల్ రోహత్గీ న్యాయవాదిగా ఉన్నారు. దీంతో రోహత్గీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో లలిత్ మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని పోస్టులలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం మరో పోస్టులో క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణ విషయాన్ని ధర్మాసనం ముందు లలిత్ మోదీ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే ప్రస్తావించారు. అంతే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోస్టులను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Twitter Users : మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిందా? ఫిబ్రవరి 1 నుంచి అప్పీల్ చేసుకోవచ్చు..!