Egypt Archeology Department : ఈజిప్ట్‌లో వెలుగులోకి 18వందల ఏళ్ల పురాతన నగరం.. వీడియో వైరల్

ఈజిప్టు‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు 1800 సంవత్సరాల పురాతన రోమన్ నివాస నగరాన్ని కనుగొన్నారు. ఆ దేశంలోని లక్సోర్ నగరంలో ఈ పెద్ద నగరం వెలుగులోకి వచ్చింది. ఈ నగరం రెండవ లేదా మూడవ శతాబ్దానికి చెందినదిగా అక్కడి పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Egypt Archeology Department : ఈజిప్ట్‌లో వెలుగులోకి 18వందల ఏళ్ల పురాతన నగరం.. వీడియో వైరల్

Egypt Archeology Department

Updated On : January 28, 2023 / 6:51 PM IST

Egypt Archeology Department : ఈజిప్టు పురాతన ప్రదేశాలకు నిలయం. అక్కడి పురావస్తు శాస్త్రవేత్తలు నిత్యం ఏళ్లనాటి కట్టడాలు, పురాతన ప్రదేశాలను వెలుగులోకి తెస్తుంటారు. ఈజిప్టులో పర్యాటకం జీడీపీలో 10శాతం వాటాను కలిగి ఉంది. ఆ దేశంలో పర్యాటకం ద్వారా రెండు మిలియన్ల మందికి ఉపాధి లభిస్తోంది. అయితే, కరోనా కారణంగా ఆ దేశంలో పర్యాటక రంగం కుదేలైంది. కరోనా అనంతరం పర్యాటక రంగం పునరుద్దరణకు చర్యలు చేపట్టినప్పటికీ రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఈజిప్టులో పర్యాటక రంగానికి కొరకరానికొయ్యగా మారింది. ఈజిప్టులో ఎక్కువ మంది పర్యాటకులు ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచే వస్తున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆ దేశంలో పర్యాటక రంగం కుదేలైంది.

Egypt : ఈజిప్టు తవ్వకాల్లో బయటపడిన 4,500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం

దేశంలో పర్యాటక రంగాన్ని పునరుద్దరించేందుకు అక్కడి ప్రభుత్వం శ్రద్ధచూపుతోంది. పురావస్తు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది జనవరిలో ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు థెబన్ నెక్రోపోలిస్ లోని రెండు పురాతన సమాధులలో వేల సంవత్సరాలు దాగిఉన్న తొమ్మిది మొసళ్ల పుర్రెలను కనుగొన్నారు. ఈజిప్టు‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు 1800 సంవత్సరాల పురాతన రోమన్ నివాస నగరాన్ని కనుగొన్నారు. ఆ దేశంలోని లక్సోర్ నగరంలో ఈ పెద్ద నగరం వెలుగులోకి వచ్చింది. ఈ నగరం రెండవ లేదా మూడవ శతాబ్దానికి చెందినదిగా అక్కడి పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

ఈజిప్టు పురావస్తు శాఖ అధిపతి ముస్తఫా వజీరి మాట్లాడుతూ.. ఈ పురాతన నగరంలో చాలా నివాస భవనాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో సురక్షితమైన భవనాలుకూడా కొన్నింటిని గుర్తించామని తెలిపారు. ప్రజలు పావురాలకోసం ఎత్తైన నివాసాలను నిర్మించుకున్నారని అన్నారు. అప్పటివారు వాడిన పాత్రలు, పనిముట్లు, కాంస్య రోమన్ నాణేలు దొరికిన అనేక ప్రదేశాలనుకూడా గుర్తించినట్లు తెలిపారు. దీనిని లక్సోర్ తూర్పు ఒడ్డున కనిపించే పురాతన, అతి ముఖ్యమైన నగరంగా ముస్తఫా వజీరి అభివర్ణించారు.