Egypt : ఈజిప్టు తవ్వకాల్లో బయటపడిన 4,500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం

పిరమిడ్ల దేశంగా పేరొందిన ఈజిప్టులో తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 4,500 ఏళ్లనాటి సూర్యదేవాలయం బయటపడింది.

Egypt : ఈజిప్టు తవ్వకాల్లో బయటపడిన 4,500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం

Lost Sun Temple discovered in Egypt after 4500 years : భూమి పొరల్లో నిక్షిప్తమైపోయిన చరిత్ర పుటల్ని..ఎన్నెన్నో రహస్యాలను వెలికి తీసి ఈ ప్రపంచానికి పరిచయం చేసే పురావస్తు శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని కనుగొన్నారు. పిరమిడ్ల దేశంగా పేరొందిన ఈజిప్టులో తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీనమైన సూర్యదేవాలయం బయటపడింది. ఈ దేవాలయం 4,500 ఏళ్లనాటిదని గుర్తించారు శాస్త్రవేత్తలు.

ఈజిప్టులోని అబూసిర్ ప్రాంతంలో ఇటలీ, పోలెండ్ పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో సూర్యదేవాలయ నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ సూర్యదేవాలయం 4,500 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. క్రీస్తు పూర్వం 2465-2323 కాలం నాటిదని అంచనా. ఫారో చక్రవర్తులు పాలించిన గడ్డపైనా సూర్యోపాసన సాగిందనడానికి ఈ ఆలయమే నిదర్శనం. ఈ ఆలయాన్ని నుసెర్రే అనే రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఈ తవ్వకాల్లో ఆలయ నిర్మాణాలే కాకుండా పలు పురాతన పాత్రలు, బీరు గ్లాసులు తదితర వస్తువులు కూడా బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఈజిప్టు కళాఖండాలు, పర్యాటక మంత్రిత్వ శాఖ జులై 31న ప్రకటించింది. ప్రాచీన ఈజిప్టు ప్రజలు సూర్య దేవత అయిన ‘రా’ను పూజించేవారు. సూర్యుడు శక్తిప్రదాత అని ఈజిప్టు ప్రజలు నమ్మకం. డేగ తలతో ఉన్న సూర్యదేవత రా చిత్రాలు గతంలో వెలుగుచూశాయి. కాగా..‘రా’ దేవుడికి మొదటి సూర్య దేవాలయం 19వ శతాబ్దంలో కనుగొనబడింది. ఈజిప్టులో ఇటువంటివి ఆరు లేదా ఏడు దేవాలయాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఈక్రమంలో శాస్త్రవేత్తలు జరిపుతున్న తవ్వకాల్లో ఇప్పటి వరకు రెండు మాత్రమే బయటపడ్డాయి.