షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడనున్న సుప్రీంకోర్టు మధ్యవర్తులు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారిన విషయం తెలిసిందే.

అయితే షాహీన్ బాగ్ లో వారి ఆందోళనలకారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. దీంతో రోడ్డు డైవర్షన్స్,రోడ్డ దిగ్భంధం నుంచి వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా షాహీన్ బాగ్ నుంచి ఆందోళనకారులు తమ నిరసనను వేరే ప్రాంతంలో కొనసాగించాలని,ఈ మేరకు ఆందోళనకారులతో మాట్లాడేందకు ఇద్దరు సీనియర్ అడ్వకేట్లను  సుప్రీంకోర్టు ఎంపిక చేసింది. సీనియర్ అడ్వకేట్లు సంజయ్ హెగ్డే,సదన రామచంద్రన్ లు ఆందోళనకారులను కలిసి, వారు వేరే ప్రాంతంలో తమ నిరసన కొనసాగించుకునేలా వారిని ఒప్పించనున్నారు. మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజహత్ హబీబుల్లా ఈ టాస్క్ లో వారికి సహాయం చేయనున్నారు.

నిరసన తెలపడం ప్రాథమిక హక్కు, రోడ్డును దిగ్భంధించకుండా వారు తమ ఆందోళనలను కంటిన్యూ చేసుకునే ప్రత్నామ్నాయ ఏరియా ఏది అని సుప్రీం కోర్టు  ప్రశ్నకు ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది సమాధానమిస్తూ…నిరసనకారులే ప్లేస్ ను ఎంపిక చేసుకోవచ్చన్నారు.

నిరసన తెలపవచ్చునని, ఇబ్బంది లేదని, అయితే రేపు ఇంకొక వర్గం వచ్చి మరో ఏరియాలో ఆందోళనలు చేయవచ్చని,దానికి ఓ విధానం తప్పనిసరిగా ఉండాలని,ప్రతి ఒక్కరూ రోడ్డను దిగ్భందించడం ప్రారంభిస్తే..ప్రజలు ఎక్కడికి వెళతారు అనేదే తమ బాధ అని సుప్రీంకోర్టు తెలిపింది. రోడ్డుపై కాకుండా వేరే స్థలంలో షాహీన్ బాగ్ లోని ఆందోళనకారులు తమ ఆందోళనలు కంటిన్యూ చేసుకోవచ్చని ఆందోళనకారుల తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తమకు కొంత సమయం కావాలని ఆందోళనకారుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ…అధికారులు సమస్యను తీవ్రతరం చేయడానికి ఇష్టపడరన్నారు.

ఆందోళనలో పాల్గొంటున్న ఎక్కువమంది మహిళలు తమ పిల్లలను తీసుకొచ్చి ముందువరుసులో కూర్చొంటున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించిన తర్వాత సుప్రీంకోర్టు మధ్యవర్తులను నియమించింది. ఈ సమస్యను తాము పరిష్కరించాలనుకుంటున్నామని,ఒకవేళ ఏదీ సఫలం కాకుంటే,తాము అధికారులకే ఈ విషయాన్ని విడిచిపెడతామని,కానీ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు