కుర్రాళ్లు అదరగొట్టారు : సర్జికల్ స్ట్రైక్‌పై క్రికెటర్ల కామెంట్స్

భారత మాజీ క్రికెటర్లు పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామును జరిగిన ఈ ఘటనలో భారత ఫైటర్స జెట్స్ 1000కేజీల బాంబులను పాక్ యుద్ధ విమానాలపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల భారత్ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్,  గౌతం గంభీర్‌లతో పాటు టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మనోళ్లు బాగా చేశారని పొగిడేస్తున్నారు.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ‘ద బాయ్స్ హేవ్ ప్లేయ్‌డ్ రియల్లీ వెల్’ కుర్రాళ్లు నిజంగా అదరగొట్టారంటూ కామెంట్ చేశాడు. 

గౌతం గంభీర్… జై హింద్, ఐఏఎఫ్

టీమిండియా యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా గట్టి పని, చాలా గట్టి పని చేసిందంటూ ట్వీట్ చేశాడు.

మొహమ్మద్ కైఫ్.. ‘సెల్యూట్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్జ్. శాందార్’ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్. చాలా గొప్ప పని చేసిందని ట్వీట్ చేశాడు.

 

టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ

యుద్ధంలో తప్పొప్పులు అనేవి జరుగుతుంటాయి. అప్పుడు తటస్థంగా వ్యవహరించకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ముందడుగేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధైర్యంగా వ్యవహరించింది. 

యుద్ధంలో తప్పొప్పులు అనేవి జరుగుతుంటాయి. అప్పుడు తటస్థంగా వ్యవహరించకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ముందడుగేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధైర్యంగా వ్యవహరించింది.

పుల్వామా ఘటనకు ధీటుగానే రియాక్షన్ ఉంటుందని చెప్పిన భారత ప్రభుత్వం అనుకున్నంత పని చేసింది. ఉగ్రదాడి జరిగిన 12రోజుల తర్వాత పాకిస్తాన్ బేస్‌డ్ ఉగ్రవాద గ్రూపును టార్గెట్ చేసి దాడి చేసింది. ఈ మేర ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ టెర్రర్ క్యాంపులపైకి సర్జికల్ దాడులు జరుపుతూ.. వెయ్యి కేజీల బాంబులను ప్రయోగించింది. 
Also Read : సర్జికల్ ఎటాక్: పాక్ చేస్తానంది మనం చేసి చూపెట్టాం