Indians height declining : భారతీయుల ఎత్తు తగ్గుతోంది: సర్వేలో షాకింగ్ విషయాలు

భారతీయుల సగటు ఎత్తు తగ్గిపోతోందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది.

Indians Height Declining (1)

Indians average height is declining : భారతీయుల సగటు ఎత్తు తగ్గిపోతోందట.JNU సెంటర్ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నిర్వహించిన సర్వేలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలోని గిరిజన మహిళలు మిగతా సంపన్నకుటుంబాల్లోని భారతీయ స్త్రీల కంటే తక్కువ ఎత్తు ఉండడం గమనించాల్సిన విషయం. కానీ స్త్రీలతో పోలిస్తే భారతీయ పురుషుల మధ్య వారి ఎత్తుపై ఆర్థిక, సామాజిక వ్యత్యాస ప్రభావం తక్కువ ఈ సర్వే వెల్లడించింది.

ఈ పరిశోధన కోసం 1998 మరియు 2015 మధ్య నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS) డేటాను ప్రతిపాదికగా తీసుకున్నారు. పిఎంఓఎస్ వన్ అనే పత్రికలో ఈ సర్వే ప్రచురింపబడింది. ఆ సర్వే ప్రకారం 2005-06 మరియు 2015-16 కాలానికి మధ్య భారతీయుల ఎత్తు బాగా తగ్గిందని తేలింది. ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న భారత స్త్రీ, పురుషుల ఎత్తు ఒక సెంటిమీటరు నుంచి అర సెంటిమీటరు ఎత్తు తగ్గింది. ఈ తగ్గుదలకు వారి కులం, మతం కూడా ఒక కారణంమని పరిశోధకులు భావించటం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా గిరిజన, సామాజికంగా వెనుబడిన వర్గాల మహిళల ఎత్తు మిగతా సంపన్న భారతీయ మహిళల ఎత్తు కంటే చాలా తక్కువగా ఉందని సర్వేలో తెలిసింది. ప్రజారోగ్యం యొక్క ప్రాథమిక సూచికల్లో ఎత్తు కూడా ఒకటి అనే విషయం మర్చిపోకూడదు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS) “1998 నుంచి 2015 వరకు భారతదేశంలో వయోజన ఎత్తుపై అధ్యయనం చేశారు. 1998-99, 2005-06, 2015-16లో సేకరించిన డేటా ఆధారంగా సగటు ఎత్తు తగ్గితున్నట్లు గుర్తించారు.తాజాగా 2019 నుంచి 20 మధ్య 6 లక్షల ఇళ్లలో సర్వే చేశారు. 15-25 మధ్య మహిళలు వారి సగటు ఎత్తు 0.12 సెం.మీ., 26-50 మధ్య మహిళలు 0.13 సెం.మీ. ఉండగా.. 15-25 మధ్య పురుషులు వారి సగటు ఎత్తులో 1.10 సెం.మీ, 26-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు 0.86 సెం.మీ. గా ఉంది. NFHS-II, NFHS-III సర్వేల మధ్య, 15-25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు వారి సగటు ఎత్తు 0.84 సెం.మీ పెరిగింది.

NFHS-III,NFHS-IV సర్వే ప్రకారం 15-25 సంవత్సరాల వయస్సు గల మహిళల సగటు ఎత్తు 0.42 సెం.మీ.లు తగ్గగా, పేద మహిళలు 0.63 సెం.మీగా ఉంది. 26-50 సంవత్సరాల వయస్సులో పేద వర్గానికి చెందిన మహిళలు వారి సగటు ఎత్తులో0.57 సెం.మీ గణనీయమైన తగ్గుదలను గుర్తించారు.పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల సగటు ఎత్తు 0.20 సెం.మీ మెరుగుపడగా, గ్రామీణ మహిళలు 0.06 సెం.మీ మాత్రమే పెరిగినట్లుగా తెలుస్తోంది.ఎత్తు పెరుగుదల దగ్గుదల విషయంలో జన్యుపరమైన, వంశపారపర్యంగా ఉన్నప్పటికీ పోషకాహారం, పర్యావరణం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువ మంది పిల్లల్ని కన్నా, వారికి సరైన పోషకాహారం అందకపోయినా వారి ఎత్తు పెరుగుదల విషయంలో తేడాలు కనిపిస్తాయి.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాల ప్రజలు సగటున…ఇతర కులాలకు చెందిన వారి కంటే తక్కువగా ఉంటారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఎత్తు లేకపోవటం ఆర్థిక ఉత్పాదకతలో 1.4% నష్టానికి దారితీస్తుందట. పరిశ్రమ సంస్థ అసోచామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై అధ్యయనం ప్రకారం, పౌరులు పోషకాహార లోపంతో భారతదేశం ప్రతి సంవత్సరం స్థూల జాతీయోత్పత్తిలో 4% కోల్పోతోంది. 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం 107 దేశాల్లో భారత్ 94 స్థానంలో ఉంది.

NHFS-V (2019-’20) ప్రకారం, 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మొదటి దశ డేటాను విడుదల చేశారు. గత నాలుగు సంవత్సరాల్లో 10 రాష్ట్రాలలో తక్కువ బరువున్న పిల్లల సంఖ్య పెరిగింది. దీనికి కారణం కరోనా. కోవిడ్ మహమ్మారి ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 53% -77% మంది ప్రజలు కరోనా సమయంలో తక్కువు ఆహారం తీసుకున్నారని ఓ సర్వేలో తేలింది.