Surya Namaskaralu : కోటి మందితో సూర్య నమస్కారాలు

గ్లోబల్ సూర్య నమస్కార్ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

crore people Surya Namaskaralu : మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సూర్యనమస్కారాలను నిర్వహిస్తోంది కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ. ఇవాళ కోటి మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు.

సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు, రోగనిరోధక శక్తి పెరుగుతాయన్నారు. దీంతో కరోనా నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. మరోవైపు ఈ కార్యక్రమంపై జమ్ముకశ్మీర్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జమ్ముకశ్మీర్‌ స్కూళ్లల్లో సూర్యనమస్కారాలు చేయించాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడంపై అక్కడి నేతలు మండిపడుతున్నారు.

Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. 2.62 లక్షలకు చేరిన రోజువారీ కేసులు

ముస్లిం మెజారిటీ ఉన్న రీజియన్‌లో ఇలాంటి ఆదేశాలు రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ సూర్య నమస్కార్ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

75 లక్షల మంది సూర్యనమస్కారాల కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ సంస్థలు పాల్గొంటాయి. ఇండియన్ యోగా అసోసియేషన్, నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్, యోగా సర్టిఫికేషన్ బోర్డు, ఎఫ్ఐటీ ఇండియా, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు భాగస్వాములయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు