Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. 2.62 లక్షలకు చేరిన రోజువారీ కేసులు

కర్ణాటకలో కొత్తగా 25005 కేసులు నమోదు, 8 మంది మృతి చెందారు. పశ్చిమబెంగాల్ లో కొత్తగా 23467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20911 కేసులు, 25 మరణాలు నమోదు అయ్యాయి.

Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. 2.62 లక్షలకు చేరిన రోజువారీ కేసులు

Corona (6)

Updated On : January 14, 2022 / 9:52 AM IST

corona cases in India : భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు 2.62 లక్షలకు చేరగా, మూడు వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 46,406 కేసులు, 36 మరణాలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 28,867 కేసులు, 31 మరణాలు నమోదు అయ్యాయి.

కర్ణాటకలో కొత్తగా 25,005 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 23,467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20,911 కేసులు నమోదవ్వగా, 25 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా 14,765 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు.

Road Accident : పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి

కేరళలో కొత్తగా 13,468 కేసులు నమోదు కాగా, 21 మంది మృతి చెందారు. గుజరాత్ లో కొత్తగా 11,176 కేసులు నమోదవ్వగా, ఐదుగురు మృతి చెందారు. రాజస్థాన్ లో కొత్తగా 9981 కేసులు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఏడుగురు మరణించారు.

పంజాబ్ లో కొత్తగా 6083 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఏపీలో కొత్తగా 4348 కేసులు నమోద్వవగా, ఇద్దరు చనిపోయారు. తెలంగాణలో కొత్తగా 2707 కేసులు, రెండు మరణాలు నమోదు అయ్యాయి.