Road Accident : పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి

చేపల లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ తాడేపల్లిగూడెం నీట్ కాలేజీ సమీపంలో బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Road Accident : పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి

Accident

Updated On : January 14, 2022 / 9:27 AM IST

Four killed in road accident : సంక్రాంతి పండగపూట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ తాడేపల్లిగూడెం నీట్ కాలేజీ సమీపంలో బోల్తా పడింది.

దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దువ్వాడ నుంచి నారాయణపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Somalia : ముంబయితో కలవనున్న సొమాలియా

డాక్టర్లు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాన్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.