Somalia : ముంబయితో కలవనున్న సొమాలియా

250మిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేది. 50మిలియన్‌ సంవత్సరాల తర్వాత భూభాగం చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడ్డాయి.

Somalia : ముంబయితో కలవనున్న సొమాలియా

Somalia

Somalia merges with Mumbai : ప్రపంచ భౌగోళిక మార్పులపై నిత్యం పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు ఓ కొత్త విషయాన్ని కొనుగొన్నారు. భారత ఆర్థిక రాజధాని ముంబయి నగర భూభాగంతో భవిష్యత్తులో ఆఫ్రికన్‌ దేశమైన సొమాలియా భూభాగం కలిసిపోతుందని వెల్లడించారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజంగానే జరగబోతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నివేదికను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ప్రచురించారు.

250 మిలియన్‌ సంవత్సరాల కిందట భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేది. 50 మిలియన్‌ సంవత్సరాల తర్వాత భూభాగం చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడ్డాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత్‌ గొండ్వానా ఖండంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ ఖండంలోని ఆఫ్రికా తూర్పు భూభాగంలో మళ్లీ చీలికలు ఏర్పడ్డాయి. మరోవైపు భారత్‌ కాలక్రమంలో లారేసియాలోని ఆసియా ఖండంలో కలిసిపోయింది.

Omicron – Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

తదనంతర కాలంలో ఏడు ఖండాలు, అనేక దేశాలు ఆవిర్భించాయి. అయితే, ఇప్పటికీ అన్ని ఖండాల భూభాగాలు నెమ్మదిగా కదులుతూ మరో చోటుకు ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భారత పశ్చిమ భూభాగమైన ముంబయి నగరంతో ఆఫ్రికా తూర్పు భూభాగంలో ఉన్న పర్వతాలు, సొమాలియా రాజధాని మొగదిషు ప్రాంతాలు కలిసిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ఇరు ప్రాంతాల మధ్య ఉన్న అరేబియా సముద్రం ఉనికి కోల్పోతుందని, ముంబయి నగరానికి సముద్ర తీరమే ఉండదని పేర్కొన్నారు. అయితే, ఇది జరగడానికి 200 మిలియన్‌ సంవత్సరాలు పడుతుందని తెలిపారు.