కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్ ఇచ్చిన మాటను పూర్తి చేశారు ఆమె కూతురు బాన్సూరి స్వరాజ్. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసును ఐసీజేలో వాధించిన ప్రముఖ న్యాయవాది హరీశ్‌సాల్వేకు ఒక్క రూపాయి బిల్లను అందజేశారు. బిల్లను అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్తాన్ సైనిక కోర్టు తప్పనిసరిగా పునఃసమీక్షించాలని అప్పటివరకు జాదవ్ మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది.. ఈ కేసు వాధించిన న్యాయవాది హరీశ్‌సాల్వే కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకుంటానన్నారు. దానికి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ సాల్వేకు ఒక్కరూపాయి ఇస్తానని మాట ఇచ్చారు.. ఆమె మృతి చెందటంతో అమ్మ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు బాన్సూరి స్వరాజ్..జాదవ్‌కు సంబంధించిన కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో భారత్ తరపున వాదించేందుకు రూపాయి ఫీజు తీసుకుంటానని న్యాయవాది హరీశ్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే..మరణానికి ముందు సుష్మా..రాత్రి 7.30గంటల సమయంలో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఇండియా గెలిస్తే..వచ్చి నీ ఫీజు తీసుకెళ్లు అని చెప్పారని హరీశ్ సాల్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. గూఢచర్యం ఆరోపణలతో పాక్ అరెస్టు చేసిన భారత పౌరుడు కుల్ భూషణ్‌కు పాక్ మిలటరీ కోర్టు..ఏప్రిల్ 10న విధించిన మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవలే తీర్పును వెలువరించింది. భారత్ తరపున ఐసీజేలో సాల్వే పోరాడారు.