Swiggy, Zomato, Amazon : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో సర్వీసులు బంద్ ..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటోతో పాటు ఇతర ఆన్ లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ లు భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్తే.

Swiggy, Zomato, Amazon, Flipkart online Services Suspended

Swiggy Zomato Amazon G20 Summit 2023 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ లు భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్తే. అమెజాన్(Amazon), ఫ్లిప్ కార్ట్, స్విగ్గి (Swiggy),జొమాటో (Zomato) లు మూడు రోజుల పాటు బంద్ కానున్నాయట. జీ20 సదస్సు(G20 Summit 2023)కు ఈ సారి ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జీ20 (G20 Summit 2023)సమావేశాలు ఈరోజే అంటే సెప్టెంబర్ 9,10వ తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో ఉన్న కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్సిబిషన్ సెంటర్ (International Convention and Exhibition Centre)లో జరుపుతున్నారు.

దీంట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ ప్రత్యేకమైన ఆంక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నేతలు హాజరవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 20 దేశాల అధిపతులతోపాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. దీంతో ఢిల్లీ అంతా ఫుల్ సెక్యురిటీ జోన్ లోకి వెళ్లిపోయింది. ఈ సమావేశాలు పూర్తి అయ్యేవరకు ఢిల్లీ అంతా సెక్యురిటీ జోన్ లోనే ఉండనుంది.

Watermelons : వామ్మో ..అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, అసలేం జరుగుతోంది..?

ఢిల్లీ పోలీస్ ప్రత్యేకమైన ఆంక్షలను అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఫుడ్ డెలివరీ సేవలైన Swiggy, Zomato సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో నిషేధించబడ్డాయి. సెప్టెంబర్ 8,9,10 తేదీలు అంటే మూడు రోజుల పాటు ఢిల్లీలో ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో,స్విగ్గి, ఫిప్ కార్ట్ సేవలు నిలిపోతాయి. వీటితో పాటు Blinkit, Zepto, Myntra వంటి కంపెనీల డెలివరీలను అనుమతించవు.

ఎన్‌డిఎంసి ప్రాంతం(NDMC area)లో డెలివరీ సేవలకు అనుమతి లేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)(Special Commissioner of Police (Traffic) ఎస్‌ఎస్ యాదవ్ (SS Yadav)తెలిపారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. అదే విధంగా 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.

ఓజు, ఐటీ ఉద్యోగులకు శుక్రవారం, సెప్టెంబర్ 8న వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. థియేటర్లు, రెస్టారెంట్లను కూడా మూసివేయాలని ఆదేశించింది.