తబ్లిగీ జమాత్ సభ్యుల దరుసు ప్రవర్తన… డాక్టర్లు,సిబ్బందిపై ఉమ్ముతున్నారు

ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారంటైన్ సిబ్బందిపై ఉమ్ముతూ దుర్మార్గంగా ప్రవర్తించారు జమాత్ సభ్యులు. తుగ్లకాబాద్ క్వారంటైన్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. వారిని అదుపుచేయడానికి సెక్యూరిటీని కోరారు క్వారంటైన్ నిర్వాహకులు. సీఆర్ఫీఎఫ్ జవాన్లతో పాటు ఢిల్లీ పోలీసులను పంపించారు అధికారులు.

మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారిన తబ్లిగీ జమాత్ హెడ్ క్వార్టర్ అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ బిల్డింగ్ నుంచి వీరందరినీ ఈ క్వారంటైన్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. 167 మంది నిజాముద్దీన్ తబ్లగీ జమాత్ కు హాజరైన వారుమంగళవారం రాత్రి 5 బస్సుల్లో తుగ్లకాబాద్ క్వారంటైన్ కేంద్రానికి చేరుకున్నారు. డీజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్ హాస్టల్ క్వారంటైన్ సెంటర్ లో 97 మందికి,70 మందికి ఆర్‌పిఎఫ్ బరాక్ క్వారంటైన్ సెంటర్ లో వసతి కల్పించినట్లు నార్తరన్ రైల్వే సిపిఆర్‌ఓ దీపక్ కుమార్ చెప్పారు.

ఇవాళ ఉదయం నుంచి ఈ క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వీళ్లందరూ వికృతంగా ప్రవర్తిస్తున్నారని, మరియు ఆహార వస్తువులకు అసమంజసమైన డిమాండ్ చేస్తున్నారని దీపక్ కుమార్ తెలిపారు. వారు క్వారంటైన్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారన్నారు. అలాగే, వారు అన్ని చోట్ల ఉమ్మివేయడం ప్రారంభించారని,పనిచేసేవాళ్లపై,వాళ్లకు సేవలందించేవాళ్లపై,డాక్టర్లపై కూడా ఉమ్మి వేయడం చేస్తున్నారని తెలిపారు. వారు హాస్టల్ భవనం చుట్టూ కూడా తిరగడం ప్రారంభించారు అని దీపక్ కుమార్ తెలిపారు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఈ కొత్త కేసులన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు కావడంతో దీనిపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించింది. తమిళనాడులో ఈ ఒక్కరోజులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ 110 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన 43 కొత్త కేసులు కూడా ఢిల్లీ నుంచి వచ్చినవే. దేశరాజధానిలో కూడా కరోనా కేసుల సంఖ్య ఒక్కరోజులో గణనీయంగా పెరిగింది. బుధవారం(ఏప్రిల్-1,2020) ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. అయితే ఇందులో 53మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారే.