ఉత్తరప్రదేశ్‌లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అలర్ట్ అయిన యూపీ పోలీసులు.. అత్యంత చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో 12మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆస్పత్రికి తరలించారు. జమాత్‌కు వెళ్లి వచ్చి అధికారులకు సమాచారం ఇవ్వనందుకు 12మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌కు హాజరై, సొంత దేశం మలేషియాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మంది మలేషియన్లను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియాలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను సొంత దేశానికి తీసుకెళ్లడానికి మలేషియన్ హైకమిషన్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది.
అయితే, తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారు కూడా ఈ విమానంలో మలేషియాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇప్పటిదాకా ఢిల్లీలోనే తలదాచుకున్నారు.
ముంబైలో 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు 433కు చేరాయి. తమిళనాడులో మరో 86 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. దీంతో తమిళనాడులో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
* టెర్రర్ వైరస్
* భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ
* ఇండియాలో 3,577కు చేరిన కరోనా కేసులు
* నిన్న కొత్తగా 577 మందికి పాజిటివ్
* 83 మందిని బలితీసుకున్న మహమ్మారి
* మహారాష్ట్రలో ఎక్కువగా కోవిడ్ మరణాలు