Annamalai: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేకమేడలా కుప్పకూలిపోతుంది: బీజేపీ

కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Annamalai – BJP: కర్ణాటక (Karnataka) ప్రభుత్వం పేకమేడలా కుప్పకూలిపోనుందని బీజేపీ తమిళనాడు (Tamil Nadu BJP) అధ్యక్షుడు అన్నమలై అన్నారు. ఓ ఏడాదిలో అది జరిగి తీరుందని జోస్యం చెప్పారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… “ఏడాదిలోపు కర్ణాటక సర్కారు పేక మేడలా కుప్పకూలుతుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య 2024లోపు గొడవలు జరగకపోతే, వారిద్దరికీ నోబెల్ పురస్కారం అందించవచ్చు” అని ఎద్దేవా చేశారు.

కాగా, తమిళనాడులో కల్తీసారా తాగి ప్రజలు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని, ఈ విషయాన్ని పట్టించుకోని సంబంధిత మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని అన్నమలై డిమాండ్ చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections 2023) కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. అయితే, తాము గెలిస్తే 5 పథకాలు తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయంపై కూడా తాజాగా అన్నమలై స్పందిస్తూ… ఆ భారీ హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.

Kothagudem: ఆ పార్టీలోకి వెళ్లిపోదామా? తన అనుచరులను అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే?

ట్రెండింగ్ వార్తలు