Video Goes Viral: ఆ వీడియోలో ఉన్నది నిజంగా జరిగిందా.. అలా ఎలా కాపాడాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజనులు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ డౌటు. తమిళనాడుకు ఓ చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేగంగా దూసుకుపోతున్న బస్సులో కండక్టర్ తన డ్యూటీలో భాగంగా ప్రయాణికులకు టికెట్లు కొడుతుంటాడు. ఇంతలో డోర్ దగ్గర నుంచున్న ప్రయాణికుడు పట్టుతప్పి బస్సు నుంచి బయటకు పడబోతాడు. కండక్టర్ సింగిల్ హేండ్‌తో పాసింజర్ చేయిపట్టుకుని సేవ్ చేస్తాడు. తర్వాత మిగతా ప్రయాణికులు అతడిని పడిపోకుండా పట్టుకుంటారు.
టికెట్లు కొట్టడంలో మునిగిపోయిన కండక్టర్ క్షణాల్లో స్పందించి సింగిల్ హేండ్‌తో ప్రయాణికుడిని కాపాడటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అంత స్పాంటేనియస్‌గా, ఫర్‌ఫెక్ట్‌గా ఎలా సాధ్యమయిందా అని ఈ వీడియో చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఈ రేర్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందన్న వివరాలు వెల్లడికాలేదు. తమిళనాడుకు చెందిన నెటిజనులు ఎక్స్‌లో ఈ వీడియో షేర్ చేశారు. దీంతో తమిళనాడులో ఈ ఘటన జరిగివుండొచ్చని భావిస్తున్నారు.
Also Read: గుండెలు అదిరిపోయే రోడ్డు ప్రమాదం..! కారుతో గుద్దితే గాల్లోకి ఎలా ఎగిరిపడ్డారో చూడండి..
ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన బస్సు కండక్టర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాసింజర్ ప్రాణాలు కాపాడిన చేతిని ‘దేవుడి హస్తం’గా పేర్కొంటున్నారు. కండక్టర్ ఉద్యోగం ఎంత గొప్పదో ఇప్పటికైనా తెలుసుకోవాలంటున్నారు. కొంతమంది మాత్రం ఈ వీడియో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా.. వీడియో ఎలా తీశారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకవేళ నిజమైతే ఒక మనిషి ప్రాణాలు కాపాడిన బస్సు కండక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ వీడియోలో ఏముందో మీరూ చూసేయండి..
கண்டக்டருக்கு அவர் செய்த வேலை எவ்வளவு பெரியது என்று இன்னும் புரியவில்லை போல..!! pic.twitter.com/16l0ZPDItg
— Rajini (@rajini198080) June 7, 2024