M K Stalin
MK Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కోవిడ్ బారిన పడ్డారు. ఆయననకు తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉండటంతో ఈరోజు పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయ్యిందని సీఎంవో నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈక్రమంలో ప్రజలంతా తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని… వ్యాక్సిన్లు వేయించుకుని జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.