Tamil Nadu : అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. క్రేన్ బోల్తా పడి నలుగురు మృతి

తమిళనాడులోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా అరక్కోణం కిల్వీడి గ్రామంలోని ద్రౌపతి అమ్మన్ ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

Tamil Nadu: తమిళనాడులోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా అరక్కోణం కిల్వీడి గ్రామంలోని ద్రౌపతి అమ్మన్ ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 10మంది గాయపడ్డారు. ఆదివారం (జనవరి 22,2023) రాత్రి 8.15 గంటల సమయంలో ఓక్రేన్ కూలి భక్తులపై పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10మంది గాయపడగా వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 1500 మంది భక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సంక్రాంతి పండుగ తరువాత మాండియమ్మన్ అమ్మన్ ఉత్సవాలను నిర్వహిస్తారు. మాండియమ్మన్ అమ్మన్ ని ద్రౌపది అమ్మన్ అని కూడా పిలుస్తారు.

ఈ ఉత్సవంలో భాగంగా అమ్మను అలంకరించటానికి భక్తులు పూల మాలలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. భక్తులు మాలలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉండగా వాటినికి కొంతమంది తీసుకుని అమ్మన్ కు అలకరిస్తారు. క్రేన్‌లో తీసుకెళ్ళిన దేవుడిని అలంకరించేందుకు భక్తుల నుండి మాలలు స్వీకరించడానికి ఎనిమిది మంది వ్యక్తులు 25 అడుగుల ఎత్తులో క్రేన్‌పై ఉన్నారు. భక్తులు పూలమాలలు తీసుకుని వేస్తుండగా క్రేన్ ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది. ఈక్రమంలో క్రేన్ కూలిపోవటంతో నలుగురు మృతి చెందారు. మరో పదిమంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని 42 ఏళ్ల కె. ముత్తుకుమార్, భూబాలన్‌ అనే వ్యాపారి, జ్యోతిబాబుతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

 

 

ట్రెండింగ్ వార్తలు