విద్యార్ధుల్లో ఆవేశాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు నేరం చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. లేటెస్ట్‌గా ఆవేశంలో ఓమ విద్యార్ధి తాను ఉంటున్నా హాస్టల్ వార్డెన్‌ను హత్య చేయడం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఎ.అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి తురైయూర్ ఇంజినీరింగ్ కళాశాలో చదువుకుంటున్నాడు.
హాస్టల్లో ఉండి చదువుకుంటున్న రహీమ్, ఎవరికీ చెప్పకుండా నాలుగు రోజులు కాలేజ్‌కు డుమ్మా కొట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. నాలుగు రోజుల పాటు లేకపోవడంపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు హాస్టల్ వార్డెన్ జి వెంకటరమణ(45).
దీంతో రహీమ్ తండ్రి, రహీమ్‌ను మందలించాడు. దీంతో వార్డెన్‌పై కోపం పెంచుకున్న రహీమ్ కత్తితో వెంకటరమణపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కడుపులో, గొంతు మీద కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన వెంకటరమణ చివరకు హాస్పిటల్‌లో చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీమ్‌ను అరెస్ట్ చేశారు.