దేశమంతా లాక్ డౌన్…చెన్నైలో భారీ ట్రాఫిక్ జామ్

కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా లౌక్ డౌన్ లో ఉన్న సమయంలో ఇవాళ(ఏప్రిల్-1,2020)ఉదయం చెన్నైలోని పాడీ ఫ్లై ఓవర్ పై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ పోలీస్ చెక్ పాయింట్ వద్ద చెకింగ్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫైఓవర్ పై పెద్ద సంఖ్యలో టూవీలర్లు,ఫోర్ వీలర్లు నిలిచిపోయాయి. మరోవైపు తమిళనాడులో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో ఫ్లై ఓవర్ పై భారీ ట్రాఫిక్ జామ్ ఆందోళన కలిగించే విషయం. తమిళనాడులో ఇప్పటివరకు 124 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా,ఒకరు మృతి చెందారు.

కాగా,భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1728 మందికి కరోనా సోకగా,21 మంది మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 8లక్షల 59వేల395మందికి కరోనా సోకగా,42వేల 328మంది ప్రాణాలు కోల్పోయారు. 70శాతంకిపైగా మరణాలు యూరప్ లోనే నమోదయ్యాయి. ప్రపంచంలోనే అధికంగా ఇటలీలో 13వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదైన దేశం అమెరికానే. అమెరికాలో దాదాపు 2లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

Must Read | 2 నెలల EMI చెల్లించకపోతే.. అదనంగా 10 నెలలు చెల్లించాలా!