దేవుడా.. : పూజ చేస్తూ ప్రమాదవశాత్తూ పూజారి మృతి

తమిళనాడులోని ఓ దేవాలయ ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది. పూజలు చేస్తున్న 40ఏళ్ల ఓ పూజారి ఒక్కసారిగా జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ దేవాలయంలో మంగళవారం జరిగింది.

  • Publish Date - January 29, 2019 / 09:16 AM IST

తమిళనాడులోని ఓ దేవాలయ ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది. పూజలు చేస్తున్న 40ఏళ్ల ఓ పూజారి ఒక్కసారిగా జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ దేవాలయంలో మంగళవారం జరిగింది.

తమిళనాడులోని ఓ దేవాలయ ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది. పూజలు చేస్తున్న 40ఏళ్ల ఓ పూజారి ఒక్కసారిగా జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ దేవాలయంలో మంగళవారం జరిగింది. దేవాలయ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన అంజనేయ స్వామి విగ్రహానికి పూలదండ వేస్తుండగా పూజారి ఒక్కసారిగా జారిపడ్డాడు. స్వామివారికి పూలమాల వేసేందుకు ఓ ఫిల్లర్ పైకి పూజారి ఎక్కాడు. అదే సమయంలో కాలు జారడంతో పైనుంచి నేలపై పడ్డాడు. వెంటనే ఇతర పూజారులు అతన్ని లేపేందుకు యత్నించారు.

 

తీవ్రగాయాలపాలైన పూజారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతుడు పూజారి వెంకటేశ్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

 

ఇటీవలే పంజాబ్‌లోని ముక్తసార్, గురుద్వారలో జరిగిన ఘటనలో కూడా మరో పూజారి ప్రాణాలు కోల్పోయాడు. మోటార్ సైకిల్, కారు ఢీకొన్న ఘటనలో 55ఏళ్ల గుర్ముక్ సింగ్ మృతిచెందాడు. బైక్ మీద వెళ్తున్న సింగ్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టంతో పూజారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.