Corona Devi Amma
Corona amma Statue In Coimbatore Temple : తమిళనాడులోని కామాక్షిపురి ఆలయంలో పూజారులు కరోనా దేవి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేస్తుననారు. కరోనా వైరస్ సోకి దేశ వ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న క్రమంలో ఇలా కరోనాను అమ్మవారి రూపంలో కొలుస్తున్నారు పూజారులు. కరోనా శాంతించాలని..అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులోని కామాక్షిపురి దేవాలయంలో పూజారులు ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం తల్లీ శాంతించు తల్లీ శాంతించు అంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహాయాగం చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మహాయాగం చేసే సమయంలో భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. గతంలో కూడా కలరా, తట్టు, మసూచీ వంటి వ్యాధులు ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మగలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజాలు చేయాలని నిర్ణయించి ఇలా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కరోనా వైరస్ శాంతిస్తుందేమో చూడాలి. అదే కనుక జరిగితే ప్రజలు హాయిగా ఊపిరి తీసుకుని మహదానందపడిపోతారు.
కరోనా వచ్చాక ఊపిరి ఆడకపోవటమే కాదు..హాయిగా ఊపిరి తీసుకోవటానికి కూడా భయపడిపోతున్నారు జనాలు. గాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతుండటంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఎక్కడ వైరస్ వచ్చి తగులుకుంటుందో..ఊపిరి తిత్తుల్లో తిష్ట వేసి ఎక్కడ ప్రాణాలు హరించివేస్తుందోనని హడలిపోతున్నారు. ఏది ముట్టుకుందామన్నా భయమే. బైటకు వెళ్లాలంటే భయం..ఇంట్లో ఉండాలంటే భయం. ఎవరినుంచి కరోనా వచ్చేస్తుందోనని భయం. ఇలా భయం గుప్పిట్లో జనాలు బతుకులు వెళ్లదీస్తున్న పరిస్థితు నెలకొన్నాయి. మరి ఈ పరిస్థితి ఏనాటికి పోయేనో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Tamil Nadu: Priests offer special prayer to 'Corona Devi' in a temple in Coimbatore to contain the spread of #COVID19
"We are continuously praying to 'Corona Devi' to show mercy on us and help us get rid of this virus," said Temple Priest (19.05) pic.twitter.com/wWu8wFm9xt
— ANI (@ANI) May 21, 2021