Tamil Nadu Woman : తమిళనాడులో దారుణం.. యూట్యూబ్ చూసి ఇంట్లోనే నార్మల్ డెలివరీ.. మహిళ మృతి.. అసలేం జరిగిందంటే?

Tamil Nadu Woman : తమిళనాడులోని తిరుప్పూర్‌లో యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రసవించేందుకు ప్రయత్నించిన మహిళ మృతి చెందింది. పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు.

Tamil Nadu Woman

Tamil Nadu Woman : యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లో ప్రసవానికి ప్రయత్నించి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యుల సలహా తీసుకోకుండా సొంత వైద్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. టెక్నాలజీ అందించే సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. అది ప్రాణాలను కాపాడగలదు.

కానీ, నిపుణుల సలహలు సూచనలు లేకుండా సొంతంగా ప్రయత్నిస్తే ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందని అనేందుకు తిరుప్పూర్‌లో ఘటనే నిదర్శనం. యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లో ప్రసవానికి యత్నించిన 32 ఏళ్ల మహిళ మృతి చెందింది. వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రసవాన్ని యూట్యూబ్ వీడియో ఆధారంగా ఇంట్లోనే చేయాలని ప్రయత్నించిన మహిళ ప్రాణాలు కోల్పోవడం తిరుప్పూర్ జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది.

మృతురాలిని తిరుప్పూర్ జిల్లా, ఉతుకుళి తాలూకాలోని పుంజైతలవాయిపాలయం గ్రామానికి చెందిన శశికళగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 24వ తేదీ ఉదయం శశికళకు డెలివరీ పెయిన్స్ వచ్చాయి. ఆమె భర్త కోలందచామి, అత్తగారు ఇంట్లోనే ప్రసవం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో నార్మల్ డెలివరీకి సంబంధించిన వీడియోలు చూసి ప్రసవానికి సాయం చేసినట్టు తెలుస్తోంది.

Read Also : Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. ఆందోళనలో అనుచరులు.. మాధురి రియాక్షన్..!

ప్రసవం తర్వాత మహిళ పరిస్థితి విషమం :
శశికళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదట్లో అంతా నార్మల్ అనిపించింది. కానీ, ప్రసవం తర్వాత ప్లాసెంటా ఆమె శరీరం నుంచి బయటకు రాలేదు. ఫలితంగా ప్రసవానంతర తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది.

దాంతో కుటుంబ సభ్యులు ముందుగా ఆమెను పెరుందరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత జూన్ 25న ఆమెను కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చాలా రోజులు చికిత్స అందించినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. జూన్ 28న ఉదయం ఆమె మరణించింది.

భర్తపై కేసు నమోదు :
శశికళ, ఆమె భర్త ముందే ఇంట్లోనే నార్మల్ డెలివరీ చేయించుకోవాలని భావించినట్టు విచారణలో వెల్లడైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. 2020లో తమ మొదటి కుమార్తె జనన సమయంలో శశికళకు సిజేరియన్ జరిగింది.

దాంతో ఆమెకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, మానసిక క్షోభకు గురయ్యారు. దాంతో తమ రెండో బిడ్డకు ఆసుపత్రిలో కాకుండా నార్మల్ డెలివరీ చేయించుకోవాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కున్నత్తూరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. అయితే, తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మృతురాలి కుటుంబం ఖండించింది.